Home » పార్టీ సిద్దాంతాల‌ కోసం మంత్రులుగా ఉన్న భార్య‌భ‌ర్త‌లు విడిపోయారు!

పార్టీ సిద్దాంతాల‌ కోసం మంత్రులుగా ఉన్న భార్య‌భ‌ర్త‌లు విడిపోయారు!

by Azhar
Ad

ఇక్క‌డ ఫోటోలో క‌నిపిస్తున్న భార్య‌భ‌ర్త‌లు 1957లో కేర‌ళ రాష్ట్రానికి చెందిన మంత్రులు. భ‌ర్త TV థామస్ కార్మిక ర‌వాణాశాఖ మంత్రిగా ఉంటే , భార్య KR గౌరీ అమ్మ ఆర్థిక శాఖా మంత్రిగా ఎన్నిక‌య్యారు. పున్నప్ర-వయలార్ తిరుగుబాటు సంద‌ర్భంగా థామ‌స్ గౌరీ ల మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది.

Advertisement

1957లో మంత్రులుగా ఎన్నికైన వీరిద్ద‌రి ప్రేమ గురించి తెల్సి ప‌క్క‌ప‌క్క క్వార్ట‌ర్స్ ఇచ్చారు. పార్టీ పెద్ద‌లే ద‌గ్గ‌రుండి మ‌రీ వీరి వివాహం జ‌రిపించారు. అలా 6 ఏళ్లు ఎంతో అన్యోన్యంగా సాగిన ఈ బంధం..1964లో క‌మ్యూనిస్ట్ పార్టీ CPM,CPIలుగా విడిపోయిన‌ప్పుడు పార్టీతో పాటే వీరి వివాహ బంధం కూడా సెప‌రేట్ అయ్యింది.

Advertisement

క‌మ్యూనిస్ట్ పార్టీ విడిపోయాక TV థామస్ CPIలోనే కొన‌సాగితే, KR గౌరీ అమ్మ మాత్రం CPMలో జాయిన్ అయ్యారు. పార్టీల సిద్దాంతాల కార‌ణంగా ఈ జంట 1965 లో సైద్ధాంతిక ప్రాతిపదికన విడిపోయారు, కానీ ఒకే ఇంట్లో కలిసి జీవించారు. 1967లో వీరిద్ద‌రూ యునైటెడ్ ఫ్రంట్ లో మంత్రులుగా ప‌నిచేశారు. అలా న‌మ్మిన సిద్దాంతం కోసం వ్య‌క్తిగ‌త జీవితాన్ని కూడా వ‌దులుకొని చ‌రిత్ర‌లో నిలిచిపోయారు ఈ క‌పుల్స్!

Visitors Are Also Reading