Home » ప్రశాంత్ వర్మ కి గిఫ్ట్ గా ఖరీదైన కారు..!

ప్రశాంత్ వర్మ కి గిఫ్ట్ గా ఖరీదైన కారు..!

by Sravya
Ad

హనుమాన్ సినిమా పెద్ద హిట్ అయింది ఈ సినిమా చాలా బాగుందని రాజకీయ సినీ ప్రముఖులు కూడా డైరెక్టర్ని ప్రశంసించారు, సంక్రాంతి కానుకగా హనుమాన్ సినిమా వచ్చి పెద్ద హిట్ని అందుకుంది ఈ భారీ కలెక్షన్లు రాబట్టింది తేజ సజ్జ ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. సినిమా రిలీజ్ అయి మూడు వారాలు గడిచినా కూడా జోరు ఏ మాత్రం తగ్గలేదు సినిమా క్రేజ్ రోజుకి పెరిగిందే తప్ప తగ్గలేదు ఓటీటీలో కూడా కొద్ది రోజుల్లోనే ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 250 కోట్లకు పైగా వసూళ్లతో సినిమా దూసుకు వెళ్ళిపోతుంది.

Advertisement

Advertisement

కేవలం 40 కోట్ల బడ్జెట్ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది ప్రశాంత్ వర్మ ఈ సినిమా సీక్వెల్ గా జైహనుమాన్ పేరుతో సినిమా చేయాలని అనౌన్స్ చేశారు. ఇది ఇలా ఉంటే ప్రశాంత్ వర్మ కి అదిరిపోయే గిఫ్ట్ ఒకటి వచ్చినట్లు తెలుస్తోంది హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి హనుమాన్ సక్సెస్ అవ్వడంతో ఖరీదైన గిఫ్ట్ ని ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మకి నిరంజన్ రెడ్డి ఆరు కోట్ల విలువైన కారుని బహుమతికి ఇచ్చినట్లు సమాచారం. కారుని కూడా బుక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదివరకు బేబీ డైరెక్టర్ కి ఇలానే నిర్మాత కారుని బహుమతిగా ఇచ్చారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading