Home » చంద్రబాబు కి కొడాలి కౌంటర్..!

చంద్రబాబు కి కొడాలి కౌంటర్..!

by Sravya
Ad

చంద్రబాబు నాయుడు కి కొడాలి కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ఆరోపణలు విమర్శలు నేతల మధ్య మాటలు తూటాలై పేలుతున్నాయి. తాను తలుపులు తెరిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. చంద్రబాబుకి మతిభ్రమించి పార్టీలో జరుగుతున్న సీట్లు వ్యవహారంపై మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. 2019లోనే ఏపీ ప్రజలు చంద్రబాబు తలుపులు, కిటికీలు పీకి హైదరాబాద్ కి పార్సెల్ చేశారని అన్నారు.

Advertisement

Advertisement

చంద్రబాబు రా కదలిరా సభ లో ప్రజలకు ఏం చేస్తారో చెప్ప లేక జగన్ ని తిడుతున్నారని అన్నారు. సీట్లు రాణి, మేము తీసేసిన వాళ్ళు మాత్రమే టిడిపి లో చేరుతున్నారని అన్నారు టీడీపీ జనసేన పొత్తుల సీట్ల ప్రకటన చేసి తర్వాత అభ్యర్థులు టీడీపీ జనసేన కొంప తగలబెడతారని అన్నారు. ఇంటి దగ్గర ఫైర్ ఇంజన్ పెట్టుకోవాలని అన్నారు వచ్చేసారి చంద్రబాబు కి ప్రతిపక్ష హోదా కూడా రాదని అన్నారు కొడాలి నాని.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading