Home » ఇంకో తెలుగు మూవీ కి విజయ్ సై… !

ఇంకో తెలుగు మూవీ కి విజయ్ సై… !

by Sravya
Ad

తమిళ్ స్టార్ హీరో విజయ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులకు కూడా విజయ్ సుపరిచితమే విజయ్ కి తమిళ్ లో ఫాలోయింగ్ ఎలా ఉందో తెలుగులో కూడా ఫాలోయింగ్ ఉంది. తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి మార్కెట్ విజయ్ కి ఉంది గత సంక్రాంతికి విజయ్ తమిళ తెలుగు బైలింగ్యువల్ సినిమా వారసుడు వచ్చింది వంశీ పైడిపల్లి ఆ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఇంకో సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు విజయ్. ట్రిపుల్ ఆర్ నిర్మత దానయ్య బ్యానర్ లో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement

త్వరలోనే సినిమా వివరాలని ప్రకటించి సమ్మర్లో షూటింగ్ మొదలుపెట్టి 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారట. తెలుగు తమిళ్ లో ఈ సినిమా తెర మీదకి రాబోతున్నట్లు కూడా తెలుస్తోంది. మరి విజయ్ కి ఈ సినిమా కూడా సక్సెస్ ని అందిస్తుందో లేదో చూడాలి. మరోవైపు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు విజయ్. ఇప్పటికే ఈ విషయం మీద రాజకీయాల్లో పెద్ద చర్చ జరుగుతుంది తమిళనాడు 2026 ఎన్నికల్లో పోటీ చేస్తాడని కూడా వార్తలు వచ్చాయి ఇప్పుడు విజయ్ తన 68వ సినిమా చేస్తున్నాడు తర్వాత ఈ తెలుగు సినిమా ఆ తర్వాత ఇంకో సినిమా అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading