మద్రాస్ హైకోర్టు దేవాలయం పిక్నిక్ స్పాట్ కాదని స్పష్టం చేసింది. హిందూ ఆలయాల్లోకి హిందువుల కానీ వాళ్లని అనుమతించొద్దని చెప్పింది. ఆలయంలో బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వం ని ఆదేశించింది రాష్ట్రం లోని దిండిగల్ జిల్లాలో ఒక హిందూ దేవాలయంలో కొంతమంది హిందూవేతరులు పిక్నిక్ స్పాట్ గా దానిని భావించి ఆలయ ఆవరణలో మాంసాహారం తీసుకున్నారు. డీ సెంథిల్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అరుళ్మిగు పళనీ దండాయుతపాణి స్వామి ఆలయం దానిలోని ఉప ఆలయాల్లోకి హిందువులు మాత్రమే అనుమతించేలా ఆదేశాలని ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది.
Advertisement
Advertisement
దీనికి సంబంధించి అన్ని ప్రవేశ ద్వారాల దగ్గర డిస్ప్లే బోర్డులని పెట్టాలని కోరారు. ఈ పిటిషన్ జస్టిస్ ఎస్ శ్రీమతి బెంచ్ విచారణ స్వీకరించడం జరిగింది. టెంపుల్ లోకి హిందువులు కానీ వారిని అనుమతించరు అనే బోర్డులు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. కేవలం ఈ ఒక్క దేవాలయం కోసం మాత్రమే దాఖలు చేశారని.. అయితే లేవనెత్తిన అంశం పెద్ద సమస్య అని తెలిపారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!