Home » హనుమాన్ సినిమాను చూసిన వెంకయ్య నాయుడు.. ఏం అన్నారో తెలుసా..?

హనుమాన్ సినిమాను చూసిన వెంకయ్య నాయుడు.. ఏం అన్నారో తెలుసా..?

by Sravya
Ad

తేజ సజ్జా, అమృత అయ్యర్ కాంబినేషన్లో హనుమాన్ సినిమా వచ్చింది. ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. భారతీయ ఇతిహాసాలోని హనుమంతుని తన స్ఫూర్తితో ఈ సినిమాని తెర మీదకి తీసుకువచ్చారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ అయింది. ఇప్పటిదాకా ఈ సినిమా వరల్డ్ వైల్డ్ గా రూ.210 కోట్ల రూపాయలని వసూలు చేసింది. హనుమన్ సినిమా ని ప్రేక్షకులే కాదు సినీ రాజకీయ నాయకులు ప్రముఖులు కూడా మెచ్చుకున్నారు. తాజాగా పద్మ విభీషణ్ వెంకయ్య నాయుడు సినిమాని చూసి తనదైన పద్ధతిలో రివ్యూ ఇచ్చారు.

Advertisement

Advertisement

చిత్ర బృందాన్ని ప్రశంసించారు. హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోస్ లో సోమవారం హనుమాన్ సినిమాని స్నేహితులతో చూసాను. ఈ సినిమాలోని ప్రతిదీ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు, గ్రాఫిక్స్ ఉన్నతంగా ఉన్నాయని మెచ్చుకున్నారు. నటీనటులు కూడా బాగా నటించారని మెచ్చుకున్నారు. వెంకయ్య నాయుడు ప్రశంసలకి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కృతజ్ఞతలు చెప్పారు. చాలా సంతోషంగా ఉందని అన్నారు. మా సినిమా గురించి మాట్లాడడం గర్వంగా ఉందని అన్నారు. హనుమాన్ వంటి సినిమాలని రూపొందించడం కొనసాగించడానికి మీ మాటలు ప్రేరేపిస్తాయి. స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని అన్నారు ప్రశాంత్ వర్మ.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading