ఎన్నికల దగ్గర పడడంతో పార్టీలు మారుతున్నారు రాజకీయ నాయకులు. ఎన్నికలవేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చేరికలపర్వం జోరుగా సాగుతోంది. టికెట్ దక్కని నేతలు పక్క పార్టీల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. సీఎం జగన్ నియోజకవర్గం ఇన్చార్జిల మార్పు వలన వైసీపీ లో టికెట్ దక్కని అసంతృప్తి నేతలు పార్టీని విడిచిపెట్టి మరో పార్టీలో చేరుకున్నారు. ఈ క్రమంలోనే మచిలీపట్నం ఎంపీ బాలసౌరీ వైసీపీని విడిచిపెట్టారు. వైసీపీకి బాలసౌరి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం జరిగింది.
Advertisement
Advertisement
ఈ మేరకు ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పలు దఫాలుగా చర్యలు జరపినట్లు తెలుస్తోంది. టికెట్ విషయంలో స్పష్టత రావడంతో బాలసౌరీ జనసేనలో అధికారికంగా చేరినట్లు ముహూర్తాన్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 4న లాంచనంగా బాలశౌరి జనసేన పార్టీలో చేరబోతున్నారని తెలుస్తోంది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బాలశౌరి జనసేన తీర్థం పుచ్చుకుపోతున్నారు వైసీపీకి గుడ్ బై చెప్పేసి సిట్టింగ్ ఎంపీ బాలసౌరికి టికెట్ పై స్పష్టమైన క్లారిటీ ఇచ్చినట్లు అర్థమవుతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!