Home » తమిళ్ స్టార్ హీరో.. కొత్త పార్టీ..?

తమిళ్ స్టార్ హీరో.. కొత్త పార్టీ..?

by Sravya
Ad

తమిళ హీరో విజయ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. విజయ్ అందరికీ సుపరిచితమే. తెలుగులో కూడా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. తమిళనాడు రాజకీయాల్లోకి ఇప్పటికే చాలామంది నటులు వచ్చారు. కరుణానిధి, ఎం.జి.రామచంద్రన్ కుష్బూ, విజయ్ కాంత్, జయలలిత ఇలా..  తాజాగా ఉదయానిది స్టాలిన్ కూడా వచ్చారు. అయితే రాజకీయాల్లోకి చాలామంది నటులు వచ్చినా సక్సెస్ అయిన వాళ్ళు మాత్రం కొంతమంది మాత్రమే. చాలా కాలంగా స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై ప్రచారం సాగుతోంది విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి సేవ చేస్తున్నారు.

Advertisement

Advertisement

2022 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన మక్కల్ ఇయక్కం తరపున అభ్యర్థుల్ని బరిలోకి దింపారు 169 స్థానాల్లో పోటీ చేస్తే 121 స్థానాల్లో విజయాన్ని సాధించారు దీంతో ఆయన రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని చాలా మంది చెప్పారు. మరో నెల రోజుల్లో కొత్త పార్టీ గురించి ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి విజయ నిజంగానే పార్టీ పెడతారా రాజకీయాల్లో విజయ్ కి కలిసి వస్తుందా లేదా అనేవి చూడాలి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading