Home » ఇంటర్వెల్ లేకుండా హన్సిక 105 మినిట్స్..!

ఇంటర్వెల్ లేకుండా హన్సిక 105 మినిట్స్..!

by Sravya
Ad

ప్రతి సినిమాకి కూడా ఇంటర్వెల్ ఇస్తారు. థియేటర్లో మనం సినిమా చూసినప్పుడు కచ్చితంగా ఇంటర్వెల్ ఉంటుంది అలా ఇంటర్వెల్ లేకుండా వచ్చిన సినిమాలు చాలా రేర్ గా ఉంటాయి. ఆపిల్ బ్యూటీ హన్సిక నటిస్తున్న తాజా సినిమా 105 మినిట్స్ ఇంటర్వెల్ లేకుండా రిలీజ్ చేస్తున్నట్లు ప్రొడ్యూసర్ చెప్పారు. సింగిల్ క్యారెక్టర్ తో సింగిల్ షాట్ తో ప్రయోగాత్మకంగా రూపొందించిన సినిమా ఇది. జనవరి 26న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది ఈ మూవీకి రాజు దుస్స దర్శకత్వం వహించారు సింగిల్ లెంత్ గంట నలభై ఐదు నిమిషాలు మాత్రమే ఉంటుందని అన్నారు అందుకే ఇంటర్వల్ లేకుండా సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. 105 మినిట్స్ సినిమాను ఇంటర్వెల్ లేకుండా షూట్ చేశామని చెప్పారు.

Advertisement

Advertisement

థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళ ఇష్టం మేరకు ఇంటర్వెల్ ఇస్తే ఇవ్వచ్చు అని ప్రొడ్యూసర్ చెప్పారు. ఈ సినిమా మొత్తం అంతా కూడా ఒకటే క్యారెక్టర్ ఉంటుంది హన్సిక తప్ప మరే పాత్ర కూడా స్క్రీన్ మీద కనపడతారని నిర్మాత చెప్పారు. బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం ఒక నటుడి వాయిస్ వినపడుతుంది అని చెప్పారు. హన్సిక కంటే ముందు వేరే హీరోయిన్తో సినిమా చేయాలని అనుకున్నాము కానీ తెలుగు తమిళ భాషల్లో హన్సికకి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఆమెను తీసుకున్నట్లు చెప్పారు. సింగిల్ క్యారెక్టర్ అయినా కూడా మూడున్నర కోట్లు పెట్టి ఈ సినిమాని తీసారట.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading