చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువమంది వెన్నునొప్పి కారణంగా బాధపడుతున్నారు. మీరు కూడా వెన్ను నొప్పితో బాధపడుతున్నారా..? వెన్నునొప్పి సమస్య నుండి బయట పడాలని అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయడం మంచిది. వెనునొప్పి తగ్గకపోయినట్లయితే ఇలా చేయాలి అప్పుడు వెంటనే మీకు ఉపశమనం లభిస్తుంది, సరైన పోస్టర్ లో ఉండండి సరైన భంగిమలో కూర్చోవడం నిలబడడం చేస్తే వీపు భాగంలో కండరాలపై ఒత్తిడిని తగ్గించొచ్చు. కంప్యూటర్ దగ్గర కూర్చునేవాళ్లు పాదాలను పూర్తిగా నేల మీద అన్చాలి అదే పనిగా పని చేయకుండా మధ్య మధ్యలో లేస్తూ నడుస్తూ ఉండాలి.
Advertisement
Advertisement
క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే కూడా నడుము నొప్పి తగ్గుతుంది. వెన్ను నొప్పికి చెక్ పెట్టాలంటే కచ్చితంగా వాకింగ్, సైక్లింగ్ లేదంటే స్ట్రెచింగ్ వంటివి చేస్తూ ఉండండి. అధిక బరువు స్థూలకాయం వలన కూడా వెన్నునొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. హెల్తి వెయిట్ చేస్తే మంచిది వీటితో పాటుగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ వుండండి. ముఖ్యంగా ఆహారంలో కాల్షియం విటమిన్ డి ఉండేటట్టు చూసుకోండి ఇలా ఈ నాలుగు విషయాలను కనుక మీరు ఆచరించినట్లయితే వెన్నెముక సమస్య తగ్గుతుంది. వెన్నునొప్పి రాదు ఆరోగ్యంగా ఉండొచ్చు.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!