Home » Ind vs Eng: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. కోహ్లీ ప్లేస్ లో రాహుల్..!

Ind vs Eng: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. కోహ్లీ ప్లేస్ లో రాహుల్..!

by Sravya
Ad

ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇండియా ఇంగ్లాండ్ మధ్య మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. హైదరాబాద్ ఉప్పల్ లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానం లో ఈ టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెంచ్ స్ట్రోక్స్ బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నారు. టాస్ గెలిచారు. దాంతో భారత్ ముందుగా బౌలింగ్ చేయబోతోంది టీమిండియా ముగ్గురు స్పిన్నర్లు ఇద్దరు పేసర్ లతో బరిలోకి దిగుతోంది. ఇక ఇది ఇలా ఉంటే వ్యక్తిగత కారణాల వలన విరాట్ కోహ్లీ జట్టు నుండి తప్పుకున్నారు.

Advertisement

Advertisement

విరాట్ కోహ్లీ స్థానంలో జట్టులోకి వచ్చిన రజత్ పటిదార్ కి నిరాశ ఎదురైంది. విరాట్ స్థానంలో కేఎల్ రాహుల్ ని ఎంపిక చేశారు. మూడవ స్థానంలో గిల్, ఐదవ స్థానంలో అయ్యర్ బ్యాటింగ్ చేయబోతున్నారు. శ్రీకర్ భరత్ కీపర్ గా ఉండనున్నారు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్నర్లుగా ఉంటే బుమ్రా, మహమ్మద్ సిరాజ్ పేస్ బాధ్యతలు తీసుకోబోతున్నారు. రాచకొండ పోలీసులు పటిష్ట బందోబస్తుని ఏర్పాటు చేశారు శాంతిభద్రతల పోలీసులతో పాటు ఆక్టోపస్, ట్రాఫిక్, ఆర్మ్డ్ ఫోర్స్ వంటి అన్ని ప్రత్యేక విభాగాల నుండి 1500 పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading