Home » ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్…!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్…!

by Sravya
Ad

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో దేవర సినిమా తెర మీదకి వస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే బయటికి వచ్చాయి. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తీసుకువస్తుండడంతో ఎక్స్పెక్టేషన్స్ కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. దేవర మూవీ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా కూడా విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో షికార్లు కొడుతోంది. దేవర సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకి వస్తున్న విషయం మనకి తెలుసు.

Advertisement

Advertisement

అయితే పార్ట్ 1 ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని మేకర్స్ చెప్పారు. కానీ సినిమాని వాయిదా వేసినట్లు తెలుస్తోంది ఈ మూవీలో వీఎఫ్ ఎక్స్ విషయంలో మేకర్స్ ముందు అనుకున్నా టైం సరిపోవట్లేదట ఊహించిన దాని కంటే ఎక్కువ సమయం పడుతుందని ఈ కారణం చేతనే మేకర్స్ దేవర రిలీజ్ ని పోస్ట్ పోన్ చేస్తున్నారని నెట్టింట వార్తలు అయితే వస్తున్నాయి ఒకవేళ నిజంగా సినిమాని కనుక వాయిదా వేస్తే ఆగస్టు 15న రిలీజ్ చేస్తారని సమాచారం. అఫీషియల్ గా రిలీజ్ గురించి తెలియాల్సి ఉంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading