Home » నెటిజెన్ పై రష్మీ ఫైర్.. నేనేమైనా ఇలాంటి తప్పులు చేసానా అంటూ…!

నెటిజెన్ పై రష్మీ ఫైర్.. నేనేమైనా ఇలాంటి తప్పులు చేసానా అంటూ…!

by Sravya
Ad

రష్మీ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు రష్మీ యాంకర్ గా ఇండస్ట్రీ లోకి వచ్చి మంచి పేరు తెచ్చుకుంది. తన టాలెంట్ తో అవకాశాలని పొందుతూ ఫేమస్ అయిపోయింది. తాజాగా యాంకర్ రష్మీ ఒక నెటిజన్ పై ఫైర్ అయ్యింది తను ఎలాంటి చట్ట విరుద్ధమైన పనులు చేయలేదని చెప్పింది. ఆమె ఇలా సమాధానం చెప్పడానికి కారణం ఏంటంటే యాంకర్ రష్మీ ఒక పోస్ట్ చేసింది. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం మీద ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రష్మి ట్విట్ చేసింది. ఒక నెటిజెన్ వ్యంగ్యంగా కామెంట్ పెట్టాడు అసంభ్యకర పనులు చేసి భగవంతుడి నామాన్ని జపిస్తే అన్ని తుడిచిపెట్టుకుపోతాయని అతను కామెంట్ చేయడం జరిగింది.

Advertisement

Advertisement

దీనిపై రష్మి స్పందించింది. నేనేమైనా డబ్బులు ఎగ్గొట్టానా లేదంటే కుటుంబ బాధ్యత మర్చిపోయి తల్లిదండ్రులని రోడ్డు మీద వదిలేసానా..? టాక్సులు కట్టలేదా చట్ట విరుద్ధమైన పనులు చేస్తున్నానా అసలు మీ దృష్టిలో అసభ్యకరమైన పనులు అంటే ఏంటి..? ఈ మధ్యకాలంలో ఇటువంటి మాటలు ఎక్కువగా వింటున్నానని నా వరకు భగవంతుడు సర్వంతర్యామి సనాతన ధర్మంలో మంచి విషయం అదేనని రష్మీ నెటిజెన్ మీద మండిపడింది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading