Home » పిల్లల్లో ఆత్మా విశ్వాసం పెరగాలంటే.. ఇలా చెయ్యడం మంచిది..!

పిల్లల్లో ఆత్మా విశ్వాసం పెరగాలంటే.. ఇలా చెయ్యడం మంచిది..!

by Sravya
Ad

ప్రతి ఒక్క తల్లి తండ్రి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ఆనందంగా ఉండాలని జీవితంలో పైకి రావాలని అనుకుంటారు. పిల్లలు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం పిల్లలు ఆత్మవిశ్వాసం పెరగాలంటే తల్లిదండ్రులు ఇలా చేయాలి. పిల్లలు తప్పు చేస్తే వాళ్ళని తిట్టకూడదు తప్పు వలన ఏర్పడే నష్టాలు ఇబ్బందులు వివరించి వాళ్ళకి చెప్పాలి. ఏ పని చేయాలన్నా అప్పుడు ఆలోచించి చేస్తారు పిల్లలు. అలానే తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలకి రోల్ మోడల్స్ లా ఉండాలి. ఇంటి పని, వృత్తి, కుటుంబం, సమాజం విషయంలో తల్లిదండ్రులు బాధ్యతగా ఉంటే పిల్లలు కూడా బాధ్యతగా తయారవుతారు.

Advertisement

Advertisement

పిల్లలకి తల్లిదండ్రులు మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వాలి అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉంటారు పైగా తల్లిదండ్రులు ని స్నేహితులుగా భావిస్తారు పిల్లలు అడిగే ప్రశ్నలకి సమాధానం తెలియకపోతే విసుక్కోకూడదు. తర్వాత చెప్తానని చెప్పాలి పిల్లలు ఆత్మవిశ్వాసం పెరగాలంటే పిల్లలకి చిన్న చిన్న టాస్కులను ఇవ్వాలి. వాళ్ళ స్కిల్స్ ని పెంచుతూ ఉండాలి తల్లిదండ్రులు మెచ్చుకుంటే పిల్లలు విజయం వైపు ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తారు. అలానే పిల్లలు అడిగే దేన్ని కూడా వద్దని చెప్పకూడదు దానికి బదులుగా వాళ్లు అడుగుతున్న దాని వెనుక కారణాలు ఎదురయ్యే పరిస్థితులు గురించి చెప్పాలి కష్టం గురించి కూడా పిల్లలకి కథలుగా చెబుతూ ఉండాలి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading