సాధారణంగా మనం పక్క వాళ్ళకి కితకితలు పెడుతూ ఉంటాము. మనకి మనం కితకితలు పెట్టుకోవడం వలన మనకి నవ్వు రాదు కానీ ఎవరైనా సరే కితకితలు పెట్టినట్లయితే నవ్వు బాగా వస్తుంది చాలామంది సరదాగా అప్పుడప్పుడు కితకితలు పెట్టుకుని నవ్వుకుంటూ ఉంటారు కానీ మనకి మనం కితకితలు పెట్టుకుంటే ఏమీ ప్రయోజనం ఉండదు ఏమి నవ్వు రాదు. మన మెదడులో సెరిబెలం ఉంటుంది ఇది మన శరీరంలో జరిగే స్వీయ చర్యలని పసి కడుతుంది. శరీర భాగాల తో మనం ఏం చేస్తున్నాము లేదంటే ఏం చేయబోతున్నాము అనేది ఇది తెలుసుకుంటుంది ఈ క్రమంలో మనకి కితకితలు పెట్టుకుంటే దానికి ఆ విషయం తెలుస్తుంది.
Advertisement
Advertisement
అందుకు ప్రతిచర్య ఉండదు సో మనకి మనం కితకితలు పెట్టుకోవడం వలన ఏమి అవ్వదు అదే ఇతరులు పెట్టారంటే మనం ముందుగా అసలు ఊహించలేము. అదే విషయాన్ని కూడా తెలియపరచలేదు. తెలియదు. ఎదుటి వాళ్లు కనుక కితకితలు పెట్టారంటే సెరిబెలం స్పందించి రియాక్షన్ ఇస్తుంది ఉలికి తో పాటుగా ప్రతి చర్య జరుగుతుంది సో మనం నవ్వుతాము. చూశారు కదా కితకితలు ఎదుటి వాళ్ళు పెడితే ఎందుకు నవ్వుతాము అనేది చాలామందికి ఈ విషయం తెలియదు. మీరు కూడా ఆలోచించి ఉంటారు కానీ జవాబు దొరికి ఉండకపోవచ్చు. కితకితలు పెడితే నవ్వడానికి అసలు కారణం ఇదేనండి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!