ఎట్టకేలకు రష్మిక మందన్నతో ఎంగేజ్మెంట్ పుకార్లపై రౌడీ హీరో విజయ్ దేవరకొండ నోరు విప్పారు. ఇటీవల, ఈ లైగర్ నటుడు లైఫ్‌స్టైల్ ఆసియాతో మాట్లాడుతూ, తాను నిశ్చితార్థం చేసుకోవడం లేదా పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేశాడు. ‘‘ఫిబ్రవరిలో నాకు నిశ్చితార్థం లేదా పెళ్లి జరగడం లేదు. ప్రతి రెండేళ్లకోసారి నాకు పెళ్లి చేయాలని మీడియా ఫిక్స్ అయిందేమో అని నాకనిపిస్తుంది అన్నారు. నేను ప్రతి సంవత్సరం ఈ పుకారు వింటూనే ఉన్నాను. వాళ్లు నన్ను పట్టుకుని.. నేనెప్పుడు పెళ్లి చేసుకుంటానా? అని ఎదురు చూస్తున్నట్లు ఉన్నారు” అని తెలిపారు.
Advertisement
Advertisement
ఇటీవల ఈ క్యూట్ జంట ఫిబ్రవరి రెండవ వారంలో మాల్దీవుల పర్యటన చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఫొటోస్ చూసిన అభిమానులు వాటిని క్షణాల్లో వైరల్ చేసారు. దీనితో వారిద్దరూ త్వరలోనే నిశ్చితార్ధం చేసుకోబోతున్నారు అన్న పుకారు మొదలైంది. వారి డేటింగ్ గురించిన పుకార్లు కూడా చాలా కాలంగా ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. అయితే.. ఈ జంట చాలా కాలంగా తమపై వస్తున్నా రూమర్స్ పై సైలెంట్ గా ఉంటున్న సంగతి తెలిసిందే.
చాలా సార్లు వీరిద్దరూ విడివిడిగా పెట్టిన ఫోటోలను చూసిన అభిమానులు.. ఆ బ్యాక్ గ్రౌండ్ లను గుర్తుపట్టి వీరిద్దరూ ఒక చోటే ఉన్నారు అంటూ కనిపెట్టేసారు. అలా.. వీరిద్దరి మధ్యా ప్రేమాయణం నడుస్తోంది అన్న వార్తలు బయటకు వచ్చాయి. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా.. వీరిద్దరి మాల్దీవ్స్ ట్రిప్ ఫోటోలు చూసి వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ విషయమై తానూ ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు అని స్పష్టం చేసారు.