Home » బావులు గుండ్రంగానే ఎందుకు ఉంటాయి..? కారణం తెలుసా..?

బావులు గుండ్రంగానే ఎందుకు ఉంటాయి..? కారణం తెలుసా..?

by Sravya
Ad

సాధారణంగా బావులన్నీ కూడా గుండ్రంగానే ఉంటాయి. ఎప్పుడైనా మీకు ఈ సందేహం కలిగిందా..? ఎందుకు బావులు గుండ్రంగానే ఉంటాయని.. బావులు గుండ్రంగా ఉండడానికి కారణం ఏంటనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఇప్పుడంటే కుళాయిలు వచ్చేసాయి. కానీ పూర్వికులు బావులని తవ్వి నీటిని సేకరించేవారు. ఇప్పటికి కూడా చాలామంది ఇళ్లల్లో బావులు ఉన్నాయి. గుండ్రని బావులు చాలా బలమైన పునాదిని కలిగి ఉంటాయి. గుండ్రని బావికి మూలాలు ఉండవు. బావి చుట్టూ నీటి పీడనాన్ని సమానంగా ఉంచుతుంది. బావి గుండ్రంగా కాకుండా చతురస్రాకారంలో ఉంటే నీటి పీడనం నాలుగు మూలల్లో కూడా ఉంటుంది. దాంతో బావి ఎక్కువ కాలం ఉండదు. పైగా కూలిపోయే ప్రమాదం కూడా ఉంది.

Advertisement

Advertisement

అందుకే ప్రపంచమంతా కూడా బావులు గుండ్రంగానే నిర్మించడం జరిగింది. ఎక్కువ కాలం అవి ఉండడానికి కారణం అవి వృత్తాకారంలో ఉండడమే. పైగా ఇతర ఆకరాల్లో బావిని రూపొందించడం కంటే గుండ్రంగా బావిని రూపొందించడం ఈజీ. బావిని మనం తవ్వి నిర్మిస్తాము. వృత్తాకార ఆకారంలో తవ్వడం ద్వారా బావిని నిర్మించడం ఈజీ. అదే మనం ఏ ఆకారంలో అయినా బావిని తవ్వాలంటే అది కొంచెం కష్టంగా ఉంటుంది ఇలా ఈ కారణాల వలన బావులు గుండ్రంగా ఉంటాయి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading