కొత్త ఫినిషర్ రింకు సింగ్ కి టెస్ట్ మ్యాచ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం వచ్చింది. ఇంగ్లాండ్ లైన్స్ జట్టు తో జరుగుతున్న రెండు మూడు టెస్టులకి బీసీసీఐ ఇండియా ఏ జట్టు ని ప్రకటించింది మూడవ అనధికారిగా టెస్ట్ టీం లో రింకు సింగ్ ఉన్నాడు. రింకు తో పాటుగా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్ కూడా సెలెక్ట్ అయ్యారు. అఫ్గానిస్థాన్ సిరీస్ లో రింకూ, సుందర్, అర్షదీప్ బాగా రాణించారు. ఆఖరి టీ20 లో రోహిత్ శర్మతో రింకూ సింగ్ జట్టును బాగా ఆదుకున్నాడు. ఇక తిలక్ వర్మ అయితే రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టును నడిపించాడు.
Advertisement
Advertisement
ఇంగ్లాండ్ జట్టుతో జరగనున్న అనధికారిక టెస్టు మ్యాచ్‌ల్లో కనుక బాగా ఆడితే, ఇంగ్లాండ్ తో జరగనున్న టెస్టు సిరీస్‌కు ఎంపిక అయ్యే అవకాశాలు కూడా అతనికి ఉన్నాయి. రెండో టెస్టుకు ‘భారత్ -ఎ’ జట్టు : అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, కుమార్ కుషాగ్రా, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, విద్వాత్ కావరప్ప, ఉపేంద్ర యాదవ్, ఆకాశ్ దీప్, యశ్ దయాల్. ఇక మూడో అనధికార టెస్టుకు ‘భారత్- ఎ’ జట్టు కి ఎంపికైన వారు అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటిదార్, తిలక్ వర్మ, రింకూ సింగ్, కుమార్ కుషాగ్రా, వాషింగ్టన్ సుందర్, షామ్స్ ములానీ, అర్ష్‌దీప్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, విద్వాత్ కావరప్ప, ఉపేంద్ర యాదవ్, ఆకాశ్ దీప్, యశ్ దయాల్.
స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!