దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన కుల గణనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కులాల వారీగా సర్వే చేపట్టడం కోసం ప్రభుత్వం ఇప్పటికే చర్యలు మొదలుపెట్టింది. ఈ బాధ్యతలను వాలంటీర్లకు అప్పచెప్పింది. గ్రామ, వార్డు స్థాయిల్లో ఉండే వాలంటీర్లు పది రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్లి కులాల వారీగా వివరాలను సేకరించనున్నారని తెలుస్తోంది. ఈ నెల 28 వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
Advertisement
సచివాలయాల మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న లెక్కల ప్రకారం 1,23,40,422 కుటుంబాలు గ్రామాల్లో ఉంటున్నాయి. వ్యక్తుల పరంగా తీసుకుంటే ఈ సంఖ్యా 3,56,62,251కు చేరుతుంది. దాదాపు 44,44,887 కుటుంబాలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నాయి. వ్యక్తిగతంగా ఈ సంఖ్యా 1,33,16,091గా ఉండనుంది.
Advertisement
సచివాలయానికి చెందిన వాలంటీర్లు, ఉద్యోగులు.. వారికి కేటాయించబడిన వీధుల్లో.. ప్రతి ఇంటికి వెళ్లి లెక్క ప్రకారం ఎంత మంది ఉంటున్నారు? మొత్తంగా ఏ కులానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారు అనే లెక్కలను తేలుస్తారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వం ఈ లెక్కలు తేల్చడానికి పైలట్ ప్రాజెక్ట్ ను చేపట్టింది. ఇప్పటికే ఏడు సచివాలయాల పరిధిలోని వాలంటీర్లు 3,323 కుటుంబాలకు చెందిన 7,195 మంది వివరాలను నమోదు చేసారు. అయితే ఈ ప్రక్రియను పారదర్శకంగా కొనసాగించడానికి జగన్ ప్రభుత్వం ఓ యాప్ ని కూడా రూపొందించింది. ఇందులో దాదాపు 723 కులాల జాబితాను పొందుపరచవచ్చు. అగ్రవర్ణాలు మొదలుకుని వెనుక బడిన సామాజిక వర్గాల వరకు అందరి కులాలు ఇందులో పొందుపొరిచారు. మొత్తంగా ఇరవై అంశాలతో ఈ కుల గణన ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!