Home » IND vs ENG తోలి టెస్ట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి?

IND vs ENG తోలి టెస్ట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి?

by Srilakshmi Bharathi
Ad

ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మూడు టి20 సిరీస్ లను ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. అయితే.. రాబోయే టెస్ట్ తో అసలు సిసలు యుద్ధానికి తెర లేపనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా.. ఇండియా ఇంగ్లాండ్ తో సొంత గడ్డ పైనే ఐదు టెస్ట్ ల సిరీస్ ఆడబోతోంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో జనవరి 25 న తొలి టెస్ట్ జరగబోతోంది. ఈ టెస్ట్ కోసం హైదరాబాద్ టెస్ట్ అసోసియేషన్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంది.

Advertisement

రీసెంట్ గానే కొత్త హెచ్ సి ఏ అధ్యక్షుడిగా సెలెక్ట్ అయిన జగన్ మోహన్ రావు తన మార్క్ ని చూపించడంలో దూసుకెళ్తున్నారు. స్టేడియం రేనోవేషన్ పై ఆయన తొలుతగా దృష్టి సారించారు. క్రితం సారి హెచ్‌సీఏ ప్యానెల్ అంతర్గత కుమ్ములాట జరగడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. విరిగిపోయిన కుర్చీలు, కుర్చీలపై కాకిరెట్టల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

CM REVANTH REDDY

Advertisement

దీనితో అంతర్జాతీయ స్థాయిలో ఉప్పల్ స్టేడియం పరువు పోయినట్లైంది. ఈ క్రమంలో కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు రేనోవేషన్ పనులను చేయించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో ఇంగ్లాండ్ మరియు ఇండియా వద్ద జరగనున్న తొలి టెస్ట్ కోసం జరుగుతున్న ఏర్పాట్లన్నిటిని ఆయన వివరించారు. ప్లేయర్స్ డ్రెస్సింగ్ రూమ్స్, టాయిలెట్స్‌ను కూడా రేనోవేట్ చేయిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ మ్యాచ్ చూడాలి అనుకునే సామాన్యుల కోసం కూడా టికెట్ ధరలను తగ్గించినట్లు తెలిపారు. గవర్నమెంట్, ప్రైవేట్ స్కూల్స్ పిల్లలకు 5000 కాంప్లిమెంటరీ పాస్‌లు అందిస్తున్నట్లు తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా సైనికులకు ఉచితంగా ప్రవేశం అందిస్తున్నామని తెలిపారు. ఈ మ్యాచ్ కి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానిస్తున్నాం అని తెలిపారు. క్రికెట్ దిగ్గజాలు సచిన్, గవాస్కర్, కపిల్ దేవ్, ధోనీ వంటి ప్రముఖులు కూడా ఈ మ్యాచ్ కి వచ్చే అవకాశం ఉందన్నారు.

 

Visitors Are Also Reading