Home » అభిమానులకి గుడ్ న్యూస్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న సలార్..!

అభిమానులకి గుడ్ న్యూస్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న సలార్..!

by Sravya
Ad

ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఈ పాన్ ఇండియా సినిమా తెర మీదకు వచ్చింది. ఈ యాక్షన్ త్రిల్లర్ సినిమా అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో శృతిహాసన్, పృధ్విరాజ్ సుకుమారం, శ్రియ రెడ్డి, ఈశ్వరి రావు, జగపతిబాబు తదితరులు నటించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న సినిమా రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద 700 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టింది సలార్ సినిమా.

Advertisement

Advertisement

అయితే ఇప్పుడు ఓటీటీ లోకి రావడానికి సిద్ధమైంది సలార్ సినిమా. జనవరి 26వ తేదీ నుండి ప్రముఖ ఓటిటి వేదిక నెట్ఫ్లిక్స్ లో సలార్ సినిమా స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఈరోజు రాత్రి 12 గంటల నుండి సలార్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వబోతోంది. ఈ సినిమాని రెండు పార్టులుగా రూపొందిస్తున్న విషయం మనకి తెలుసు. సలాడ్ సీక్వెల్ టైటిల్ ని పార్ట్ వన్ చివర్లో డైరెక్టర్ ప్రశాంత్ రివిల్ చేయడం జరిగింది. రెండవ పార్ట్ కి సలార్ శౌర్యంగా పర్వం అనే పేరుని ఫిక్స్ చేశారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading