మాటలతో గారడీ చేస్తాడు కాబట్టే డైరెక్టర్ త్రివిక్రమ్ ను మాటల మాంత్రికుడు అని పిలుస్తూ ఉంటారు. ఆయన తీసిన ప్రతి సినిమాలో తన మార్క్ ఎమోషనల్ సన్నివేశాలు.. డైలాగ్స్ ఉండేలా చూసుకుంటారు. అందుకే త్రివిక్రమ్ సినిమా అంటే చాలు మొదటి రోజే థియేటర్ కు వచ్చి చూడాలి అని అనుకునేవారు చాలా మందే ఉంటారు. ఒక రైటర్ గా త్రివిక్రమ్ చాలా సక్సెస్ లే అందుకున్నారు.
Advertisement
ఆ తరువాత డైరెక్షన్ మీద ఉన్న ఆసక్తి కొద్దీ డైరెక్టర్ గా కూడా మారారు. చాలా సినిమాలను డైరెక్ట్ చేసి మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే.. ఇటీవల ఆయన సినిమాలో త్రివిక్రమ్ మార్క్ ఎమోషన్స్ ఎక్కువగా కనిపించడం లేదు. గుంటూరు కారం సినిమాలో కూడా త్రివిక్రమ్ మార్క్ ఎమోషన్స్ కనిపించకపోవడంతో ఫ్యాన్స్ చాలా అప్ సెట్ అయ్యారు. దీనితో ఈ విషయమై త్రివిక్రమ్ పై ట్రోలింగ్ ఎక్కువ అయ్యింది.
Advertisement
ఆయన సినిమాల్లో ఎక్కువగా యద్దనపూడి సులోచన రాణి నవలలోని పాత్రలను స్ఫూర్తిగా తీసుకుంటారు. ఇటీవల తీసిన గుంటూరు కారం సినిమా కూడా యద్దనపూడి సులోచన రాణి గారి కీర్తి కిరీటాలు నవలను స్ఫూర్తిగా తీసుకుని తీసినదే. అయితే.. త్రివిక్రమ్ రచనల్లో కొత్తదనం కనిపించడం లేదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం యద్దనపూడి సులోచన రాణి మన మధ్య లేరని.. అందుకే త్రివిక్రమ్ రచనల్లో కూడా రొటీన్ ఫార్ములాలు కనిపిస్తున్నాయి అంటూ త్రివిక్రమ్ ను ట్రోల్ చేస్తున్నారు.