Home » ప్రియమణి భామ కలాపం 2 గ్లిమ్ప్స్ అదుర్స్…!

ప్రియమణి భామ కలాపం 2 గ్లిమ్ప్స్ అదుర్స్…!

by Sravya
Ad

ఆహా ఓటీటీ లో ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలు వస్తున్నాయి. వివిధ వెబ్ సిరీస్ లని సినిమాలను తీసుకు వస్తూ పాపులర్ అయిపోయింది ఆహా. కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. అయితే ఇదివరకు ఆహా ఓటీటీ లో భామ కలాపం సినిమా వచ్చింది అది ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనకి తెలుసు. హీరోయిన్ ప్రియమణి శరణ్య ప్రదీప్ నటించిన ఈ మూవీకి రెస్పాన్స్ అయితే అదిరిపోయింది. అభిమన్యు తడిమేటి తెరకు ఎక్కించిన భామకలాపం ఫిబ్రవరి 11న 2022లో రిలీజ్ అయింది.

Advertisement

Advertisement

నాలుగు మిలియన్స్ కి పైగా వ్యూస్ ని సాధించింది బ్లాక్ బస్టర్ గా నిలిచింది దానికి సీక్వెల్ భామకలాపం 2 రాబోతోంది. గ్లిమ్ప్స్ ని తాజాగా రిలీజ్ చేశారు. భామాకలాపం వన్ లానే ఇది కూడా బాగా ఆకట్టుకుంటుందని అంత ఎదురు చూస్తున్నారు అనుపమ పాత్రలో ప్రియమణి అమాయకపు ఇల్లాలుగా నటించబోతోంది. ఈ చిత్రాన్ని డ్రీం ఫార్మల్స్ బాపినీడు బి మరియు సుధీర్ ఈదరతోపాటు ఆహా రూపొందిస్తుంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading