ఇండియాలో గడిచిన 24 గంటల్లో 2,85,914 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 665 మంది కరోనాతో మరణించారు. డైలీ పాజిటివిటీ రేటు 16.16గా నమోదవుతోంది. ప్రస్తుతం దేశంలో 22,23,018 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రాజ్‌భవన్‌లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో 13 కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. వాటిలో పార్వతీపురం జిల్లా, అరకు జిల్లా, అనకాపల్లి జిల్లా, రాజమండ్రి జిల్లా, అమలాపురం జిల్లా, నరసాపురం జిల్లా, విజయవాడ జిల్లా, నరసరావుపేట జిల్లా, బాపట్ల జిల్లా, తిరుపతి జిల్లా, రాజంపేట జిల్లా, హిందూపురం జిల్లా, నంద్యాల జిల్లాలు ఉన్నాయి.
ఏజెన్సీలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు వివాదం కొనసాగుతోంది. డుంబ్రిగూడ మండలం కొల్లాపుట్ పరిధిలోని ఆంధ్రా గిరిజనులకు చెందిన కాఫీ తోటలు, సిల్వర్ చెట్లను ఒడిశా వాసులు నరికేశారు. ఆ ప్రాంతం తమదిగా చెబుతూ అక్కడి పంటలను ధ్వంసం చేస్తూ బలవంతంగా ఒడిశా ప్రజలు తీసుకెళుతున్నారు.
Advertisement
క్రికెటర్ యువరాజ్ దంపతులు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని యువరాజ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
కరోనాపై పోరులో భారత్ ప్రస్థానం అపూర్వమని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. కరోనా సంక్షోభం ముగిసే వరకూ నిపుణులు సూచనలు పాటించాలని తెలిపారు.
ఇండోటిబెటన్ బోర్డర్ పోలీసులు గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. 15000 అడుగుల ఎత్తులో మైనస్ 35 డిగ్రీల ఊష్ణోగ్రతలో వేడుకలను నిర్వహించారు.
పద్మభూషణ్ అవార్డును పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్ర బుద్దదేవ్ బట్టాచార్య తిర్కరించారు. అవార్డు గురించి తనకు ఎవరూ చెప్పలేదని ఒకవేళ నిజమే అయితే దాన్నితాను తిరస్కరిస్తున్నానని చెప్పారు.
డ్యాన్స్ కొరియోగ్రాఫర్ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ యాని మాస్టర్ కూడా కరోనా బారిన పడ్డారు.
ఏపీలో జనాభా కొత్త లెక్కలను ప్రకటించారు. కాగా కర్నూలు జిల్లా జనాభాలో టాప్ స్థానంలో ఉన్నట్టు ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అతితక్కువ జనాభా ఉన్నట్టు తెలిపారు.