సంక్రాంతి సందర్భంగా గురూజీ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా గుంటూరు కారం రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఎన్ని పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయో.. అన్ని నెగటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. కమర్షియల్ గా హిట్ అయిన ఈ సినిమా కాన్సెప్ట్ పరంగా మాత్రం ఆకట్టుకోలేకపోయింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. మహేష్ ని విపరీతంగా అభిమానించే ఓ వీరాభిమాని మహేష్ బాబు కు ఓ బహిరంగ లేఖ రాసారు. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీటిని చదవండి: Gunturu Kaaram: మహేష్ బాబు గుంటూరు కారం సినిమా మీద మరో వివాదం..!
Advertisement
అతడు, పోకిరి సినిమాల్లో కనిపించిన మహేష్ బాబు స్టైల్ ని ఇప్పటికీ చాలా మంది ఫాలో అవుతుంటారు. ఇదే విషయాన్ని అభిమాని శ్రీనివాస్ సార్ల తన లేఖలో పేర్కొన్నారు. ఆరోజుల్లోనే ఏ సినిమా హీరో చేయని సాహసాన్ని నాని సినిమాతో చేసి చూపించారని, వన్ నేనొక్కడినే, ఖలేజా లాంటి ప్రయోగాత్మక సినిమాలు చేసిన మహేష్ బాబు ఇప్పుడు ఒకే ధోరణి సినిమాలు ఎంచుకోవడం నచ్చడం లేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.
Advertisement
వీటిని చదవండి: హనుమాన్ దర్శకుడు నెక్స్ట్ సినిమా ఏ హీరోతోనో తెలుసా..?
హిట్స్ తో ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా అప్పట్లో ప్రయోగాత్మక సినిమాలు చేసారని.. ఇప్పుడు మాత్రం మూస ధోరణి సినిమాలు చేస్తున్నారని అన్నారు. మహేష్ కు నలభై ఏళ్ళు అంటే ఎవ్వరూ నమ్మరు. ఆన్ స్క్రీన్ పై ఆయనని చూస్తే ఏజ్ అన్న విషయమే గుర్తురాదు. అలాంటి ఫిజిక్, టాలెంట్ పెట్టుకుని ఇలాంటి సినిమాలు ఎందుకు అన్నా? అంటూ శ్రీనివాస్ ప్రశ్నించారు. ప్రశాంత్ నీల్, ప్రశాంత్ వర్మ లాంటి కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇవ్వాలని.. కొత్త ప్రయోగాలు చేయాలనీ కోరారు. కమింగ్ అప్ ప్రాజెక్ట్ కూడా డౌటే అని.. అది కూడా ఇలానే కమర్షియల్ గా ఉండేలా ఉంటుందేమోనని అన్నారు. శ్రీనివాస్ సార్ల రాసిన లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది. దాన్ని మీరు కూడా ఇక్కడ చదివేయండి.