గుంటూరు కారం సినిమా రిలీజ్ అయినప్పటినుండి నెగిటివ్ కామెంట్లు ఎక్కువగా వినపడుతున్నాయి. మహేష్ బాబు హీరోగా సంక్రాంతి కానుక గుంటూరు కారం సినిమా రిలీజ్ అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. తాజాగా గుంటూరు కారం ఒక సమస్యలో ఇరుక్కుంది. విలన్స్ కి మార్క్స్ లెనిన్ పేర్లు పెట్టి వాళ్ళ పాత్రలని చెడుగా చూపించారు దీంతో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ చెప్పారు. అలానే అసభ్యకరంగా రాసిన మడత కుర్చీ పాటని తక్షణమే సినిమా నుండి తొలగించాలని త్రివిక్రమ్ మతిభ్రమించిందని అన్నారు.
Advertisement
Advertisement
ప్రపంచ కమ్యూనిస్టు విప్లవకార్లు మార్క్సిస్ట్ మహోపాధ్యాయులు పేర్లని సినిమాలో విలన్స్ కి పెట్టి సమాజానికి తప్పుడు అవగాహన కల్పించాలని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కార్ల్ మార్క్స్ ప్రపంచానికి కమ్యూనిజన్ని పరిచయం చేసిన వ్యక్తి అని అన్నారు. అటువంటి మహానేతల పేర్లను గుంటూరు కారం సినిమాలో విలన్స్ కి పెట్టడం తీవ్రమైన అభ్యంతకరమని అన్నారు. అలానే కుర్చీ మడత పెట్టి సాంగ్ కూడా బాలేదని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. త్రివిక్రమ్ మహేష్ బాబు బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పి తొలగించాలని అన్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!