నందమూరి వారసుడిగా బాలయ్య బాబు కంటే ముందు మరో హీరో ఎంట్రీ ఇచ్చారని తెలుసా? ఆయనే నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. ఈయన కూడా తన కెరీర్ లో చాలా మంచి సినిమాలలో నటించి ప్రేక్షకుల మన్నన పొందారు. ఈయన సినిమాల్లోకి రాక ముందే.. చదువుకుంటున్న రోజుల్లోనే ఈయనను హీరోగా పరిచయం చేస్తామంటూ.. చాలా మంది దర్శక నిర్మాతలు ముందుకొచ్చేవారట. అయితే.. ఈయన తండ్రి, ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమ రావు ఈయన చదువు పూర్తి అయ్యేవరకు ఆగాలని చెప్పేవారట.
Advertisement
చదువు పూర్తి అయ్యాక ఈయనను తీసుకెళ్లి ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణకు అప్పచెప్పారట. కోడి రామకృష్ణ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి హీరోగా మొదటి సినిమా అత్తగారు స్వాగతం వచ్చింది. ఈ సినిమా అప్పట్లో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఆ తరువాత తలంబ్రాలు సినిమాకు కూడా కోడి రామకృష్ణ డైరెక్షన్ లోనే కళ్యాణ్ చక్రవర్తి నటించారు. ఈ సినిమాలో కళ్యాణ్ ది సెకండ్ హీరో పాత్ర కావడం, మరియు మెయిన్ హీరోగా నటించిన రాజశేఖర్ నటనలో వేరియేషన్స్ చూసిన ప్రేక్షకులు ఈ సినిమా హిట్ అయ్యినా కళ్యాణ్ చక్రవర్తి గురించి ఎవరూ మాట్లాడలేదు.
Advertisement
ఆ తరువాత కూడా కళ్యాణ్ చక్రవర్తి చాలానే సినిమాలు చేసేవారు. ఈయన చేయాల్సిన సినిమాలన్నిటి గురించి ఆయన తండ్రి త్రివిక్రమ్ రావు గారే చూసుకున్నారు. మొదటి సినిమా అత్తగారు స్వాగతం కు మాత్రం ఎన్టీఆర్ క్లాప్స్ కొట్టారు. ఆ తరువాత ఆయన ఇన్వాల్వ్ మెంట్ లేదనే చెప్పాలి. మరోవైపు బాలయ్య బాబు కెరీర్ విషయంలో మాత్రం ఎన్టీఆర్ అన్నీ పట్టించుకునేవారు. కొడుకుకు ఎక్కడ పోటీగా వస్తాడో అన్న కారణంతోనే ఎన్టీఆర్ కళ్యాణ్ చక్రవర్తిని పట్టించుకోలేదు అన్న వార్తలు కూడా అప్పట్లో మీడియాలో వస్తూ ఉండేవి.
కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లోనే కళ్యాణ్ చక్రవర్తి సోదరుడికి ప్రమాదం ఎదురైంది. ఈ యాక్సిడెంట్ లో సోదరుడు మరణించాడు. తండ్రి కూడా గాయాలపాలై ఇంటికే పరిమితం అయ్యారు. దీనితో ఒక్కసారిగా కళ్యాణ్ చక్రవర్తికి బాధ్యతలు ఎక్కువ అయ్యాయి. ఎన్టీఆర్ తన సంపాదనలో కొంత త్రివిక్రమ రావుకు ఇవ్వగా.. ఆయన ఆ సొమ్ముని ఇన్వెస్ట్మెంట్స్ లో పెట్టి వ్యాపారాలు నడిపారు. ఈ వ్యవహారాలన్నీ కళ్యాణ్ చక్రవర్తే చూసుకోవాల్సి వచ్చింది. దీనితో ఆయన కెరీర్ ను పక్కన పెట్టాల్సి వచ్చింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!