ఇండియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానికి గురువారం తన జీవితంలో ఒక గుర్తుండిపోయే రోజు అని చెప్పొచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు పెరిగిన తర్వాత కొత్త రికార్డుని సృష్టించారు అంబానీ. ఇంకోవైపు భారతదేశంతో సహా మొత్తం ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తి సంపద విపరీతంగా పెరిగిపోయింది. దీని ఆధారంగా ముఖేష్ అంబానీ 100 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి ప్రవేశించారు. ఫోర్బ్స్ రియల్ టైం జాబితా ప్రకారం చూసినట్లయితే అంబానీ నికర విలువ ఇప్పుడు 105.2 బిలియన్ డాలర్లకి చేరింది.
Advertisement
Advertisement
నిన్న ఒక్కరోజే అంబానీ సంపాద 2.7 మిలియన్ డాలర్లు అంటే 2.6% పెరిగింది. ఇలా వంద మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపద ఉన్న ప్రపంచం లోని సంపన్నుల జాబితాలో చేరారు ముకేశ్ అంబానీ మరోసారి. ముఖేష్ అంబానీ ఇప్పుడు 11వ స్థానానికి చేరారు. బ్లూమ్బెర్గ్ బిలియర్స్ ఇండెక్స్ లో ముకేశ్ అంబానీ నికర విలువ 100 మిలియన్ బిలియన్ డాలర్ల మార్క్ కి ఒక అడుగు దూరంలోనే ఉందట. ముకేశ్ అంబానీ మొత్తం సంపద చూస్తే 99 బిలియన్ డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో 12వ ప్లేస్ లో ఉన్నారు అంబానీ.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!