కరోనా విజృంభణ తర్వాత సాయం అంటే సోనూసూద్ గుర్తుకొచ్చేలా మారిపోయింది. కరోనా విజృంభణ సమయంలో సోనుసూద్ ఒక శక్తి లా మారి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సొంత డబ్బులతో ప్రజా సేవ చేశారు. పట్టణాల్లో చిక్కుకున్న పేద కూలీలను తన డబ్బుతో సొంత బస్సులను ఏర్పాటు చేసి స్వగ్రామాలకు తరలించాడు. సెకండ్ వేవ్ లో ఎంతోమందికి ఆక్సిజన్ సిలిండర్ లు సరఫరా చేశాడు. అయితే అలాంటి మంచి మనసు ఉన్న సోనుసూద్ రాజకీయాల్లోకి రావాలని చాలా మంది కోరుకుంటున్నారు.
Advertisement
అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఇదే అంశంపై ప్రశ్నించారు. దాంతో సోనుసూద్ ప్రస్తుతం సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాను అని తెలిపాడు. ఐదేళ్ల తర్వాత రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే తన సోదరి మాళవిక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో చేరిన మాళవిక పంజాబ్ లోని మెగా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతోంది.
Advertisement
ఈ సందర్భంగా సోనూ మాట్లాడుతూ….ఆ నియోజకవర్గం తో తన తల్లికి ఎంతో అనుబంధం ఉందని చెప్పాడు. తన తల్లి ఎంతోమందికి విద్యను అందించిందని విద్యకు కావలసిన సదుపాయాలను కల్పించారని తెలిపారు. ఇక గతంలో తన తల్లి ని ఆదర్శంగా తీసుకుని తన తల్లి చెప్పిన మాటలను విని తాను సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు సోనూ చెప్పారు.