కిన్నెర మొగులయ్య ను పద్మశ్రీ అవార్డు వరించింది. భీమ్లా నాయక్ సినిమాలోని ఓ పాటకు కిన్నెర స్వరాలు అందించి మొగులయ్య ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. మొగులయ్య తెలంగాణ లోని నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం గుట్ట రాయి పాకుల గ్రామంలో జన్మించారు. 12 మెట్ల కిన్నెర కళాకారునిగా ఆయనకి ఎంతో గుర్తింపు ఉంది. అంతే కాకుండా మొగులయ్య యాభై రెండు దేశాల ప్రతినిధుల ముందు 12 మెట్ల కిన్నెర గానంతో ప్రదర్శన ఇచ్చి ఆకట్టుకున్నారు.
Advertisement
Advertisement
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మొగులయ్య ఉగాది విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. అంతేకాకుండా 8వ తరగతి పాఠ్యపుస్తకాల్లో సాంఘిక శాస్త్రంలో కిన్నెర మొగులయ్య చరిత్రను పాఠ్యాంశంగా పొందుపరిచారు. ఇక ఇప్పుడు ఆయనను పద్మశ్రీ వ్యవహరించడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కూడా కిన్నెర మొగులయ్య కు ఆర్థిక సాయం చేసిన సంగతి తెలిసిందే.