మన దేశంలో అయోధ్య ఉన్న విషయం మనకి తెలుసు. కానీ మన దేశంలోనే కాదు ఇంకో దేశం లో కూడా అయోధ్య ఉంది. ఆ నగరాన్ని కూడా కచ్చితంగా చూడాలి. ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య రామ మందిరం ని సర్వాంగ సుందరంగా సిద్ధం చేస్తున్నారు విగ్రహాల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించడానికి దేశవ్యాప్తంగా వేల మంది అయోధ్యకి వెళుతున్నారు. అయితే కేవలం మన భారతదేశంలోనే అయోధ్య లేదు. థాయ్, బర్మా శిల్పుల నైపుణ్యానికి సాక్ష్యంగా నిలుస్తుంది ఆ నగరం. థాయిలాండ్ వెళ్లిన ప్రతి ఒక్కరు కూడా ఈ అయుతయ నగరాన్ని చూసి వస్తూ ఉంటారు.
Advertisement
Advertisement
భారతీయ యాత్రికులకు థాయిలాండ్ లో అయుతయ నగరం అయోధ్యని గుర్తు చేస్తుంది. ఇది ఒక పురాతన భారతీయ నగరంలో కనబడుతుంది ఈ నగరాన్ని 1350లో స్థాపించారు. నాలుగు శతాబ్దాలకు పైగా ఈ నగరాన్ని థాయిలాండ్ కి రెండవ రాజధానిగా ఉంచారు. కాలం గడుస్తున్న కొద్ది రాజ్యాలు కూలిపోయాయి చివరికి వాణిజ్య కేంద్రంగా ఇది అభివృద్ధి చెందింది. మన అయోధ్య ఈ ఆయోతయా నగరాలు ఒకేలా ఉండడమే కాదు రెండు నగరాల సాంస్కృతిక మతపరమైన సంబంధాలు కూడా ఒకే విధంగా ఉంటాయి. ఇక్కడ బంగారు ద్వారం వుంది. ఇది మన అయోధ్య నగరాన్ని గుర్తుతెస్తుంది.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!