మహేష్ బాబు హీరోగా సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమా రాబోతోంది. ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. అయితే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా సినీ ఇండస్ట్రీపై సీతకన్నేసిన జగన్, ఎన్నికల సమయం రావడంతో సూపర్ స్టార్ అభిమానుల్ని బాధ పెట్టకూడదని అనుకున్నారో ఏమో కానీ గుంటూరు కారం సినిమా టికెట్ల ధర ని పెంచడానికి అనుమతి ఇచ్చారు. గుంటూరు కారం పై ఒక్కో టికెట్ కి రూ.50 వరకు అదనంగా పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం చెప్పింది.
Advertisement
Advertisement
రిలీజ్ తేదీ నుండి పది రోజులు పాటు ఈ పెంచిన ధరలతో టికెట్ల విక్రయించుకోవచ్చు అని జీవోలో పేర్కొంది. ఎన్నికల కోసమో లేదంటే వచ్చే నెలలో రాబోతున్న యాత్ర టు కోసమో ఈ మార్పు అయితే చేశారు. మొత్తానికి జగన్ సర్కార్ మహేష్ బాబు గుంటూరు కారం పై చల్లని చూపు కురిపించింది. మరి సంక్రాంతికి రాబోయే మిగిలిన సినిమాలను కూడా ఇలానే మార్పు చేస్తుందనేది చూడాలి. మహేష్ బాబు ఫ్యాన్స్ గుంటూరు కారం సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నారు. హిట్ అవుతుంది అని అనుకుంటున్నారు. మరి మహేష్ బాబు సంక్రాంతికి హిట్టు కొడతాడా లేదా అనేది చూడాలి.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!