Home » మరో ఛాన్స్ కొట్టేసిన పెళ్లి సందడి హీరోయిన్…టాలెంటెడ్ హీరో పక్కన ఛాన్స్…!

మరో ఛాన్స్ కొట్టేసిన పెళ్లి సందడి హీరోయిన్…టాలెంటెడ్ హీరో పక్కన ఛాన్స్…!

by AJAY
Ad

జాతిరత్నాలు సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి. ప్రస్తుతం వరుస సినిమాలతో ఈ యంగ్ హీరో ఫుల్ బిజీగా ఉన్నాడు. తన నటనతో కామెడీ టైమింగ్ తో నవీన్ పోలిశెట్టి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి.. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో అనగనగా ఒక రాజు అనే సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థ మరియు సితార ఎంటర్ టైన్ మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి.

Advertisement

Advertisement

పెళ్లి అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమా తో వెండితెరకు పరిచయమైన శ్రీలీల మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంది.

Sreeleela

గ్లామర్ తో పాటు నటనతో మెప్పించింది. ఇక వరుస ఆఫర్లు వస్తుండటంతో ఈ బ్యూటీ రెమ్యూనరేషన్ కూడా కోటి వరకు ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే రవితేజ హీరోగా నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా శ్రీలీలను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Visitors Are Also Reading