Home » స్టేజీ మీద పెళ్లి ప్రొపోజల్ చేసిన ఆర్జీవీ.. ఆమె ఎవరంటే..?

స్టేజీ మీద పెళ్లి ప్రొపోజల్ చేసిన ఆర్జీవీ.. ఆమె ఎవరంటే..?

by Sravya
Ad

టాప్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక వివాదంలో రాంగోపాల్ వర్మ ఉంటూ ఉంటారు ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తాల్లోకి ఎక్కుతూ ఉంటారు. రాంగోపాల్ వర్మ చేసే కామెంట్లు చాలామంది ఇష్టపడరు. అయితే కొంతమంది మాత్రం ఈయనని దేవుడిగా భావిస్తారు. తాజాగా ఆయన మరో అమ్మాయిపై మనసు పారేసుకున్నారు ఇక ఆమె వివరాల గురించి ఇప్పుడే చూసేద్దాము. ఎప్పుడూ కూడా ఒక కొత్త అమ్మాయితో కనబడుతూ ఉంటాడు ఆర్జీవి తనకి నచ్చిన విధంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.

Advertisement

ఆ ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా సోషల్ మీడియా వేదికగా తను చేసిన పనులను చెప్తూ ఉంటారు. ఆర్జీవి ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా ఒక చేతిలో మందు గ్లాసు ఇంకో చేతులో అందమైన అమ్మాయిని పట్టుకొని ఒక షో కి వచ్చారు అక్కడ ఒక తెలుగు బుల్లితెర నటికీ ప్రపోజ్ చేశాడు ఇది లవ్ ప్రపోజల్ కాదు ఏకంగా మ్యారేజ్ ప్రపోజల్.

Advertisement

ram gopal varma

ప్రముఖ టీవీ ఛానల్ న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించిన షోలో రాంగోపాల్ వర్మ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ఆ షో కి వెళ్లిన ఆర్జీవి అప్పట్లోనే తన మాటలతో అందరిని అలరించారు. రష్మీ రోహిణి వర్ష హిమజా లాస్య పవిత్ర ఇలా కొంతమంది అమ్మాయిలు స్టేజ్ మీద ఉన్నారు. వర్ష మీకు నేను కావాలా పార్టీ కావాలా అని అడిగితే నువ్వే కావాలి అని అంటాడు. తర్వాత మీరు ఎప్పుడూ అమ్మాయిలకి ఎందుకు సపోర్ట్ చేస్తారని అడిగితే నేను అమ్మాయిని కాదు కనుక అని పంచ్ వేస్తాడు. తర్వాత స్టేజ్ మీద ఉన్న అమ్మాయిలు అందరికీ కూడా ప్రపోజ్ చేశారు ఏకంగా విల్ యు మ్యారి మీ అంటూ అందరిని అడిగేసారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading