కొన్ని కొన్ని విషయాలని జీవిత భాగస్వామితో కానీ రిలేషన్ షిప్ లో ఉన్న వ్యక్తితో కానీ షేర్ చేసుకోవడం మంచిది కాదు. కొన్నిటిని రహస్యంగానే ఉంచడం మంచిది. కొన్ని విషయాలని చెప్పేస్తే అమ్మాయిలూ అది మీకే ప్రమాదం. అమ్మాయిలు ఆ కచ్చితంగా ఈ విషయాలని దాచి ఉంచాలి. మీ భర్తకి కానీ బాయ్ ఫ్రెండ్ కి కానీ అమ్మాయిలు ఈ విషయాలని ఎట్టి పరిస్థితుల్లో చెప్పద్దు. చాలామంది మేకప్ వేసుకుని అందాన్ని పెంచుకుని చూపించాలని చూస్తూ ఉంటారు. అయితే ఎక్కువ కాలం అలా కొనసాగడం మంచిది కాదు. మీ నిజరూపాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి.
Advertisement
అలానే ఎప్పుడు కూడా భర్తకి కానీ బాయ్ ఫ్రెండ్ కి కానీ మాజీ లవర్ గురించి చెప్పకూడదు మాజీ ప్రియుడు గురించి చెప్పినట్లయితే మీ రిలేషన్ దెబ్బతింటుంది. మీ జీవిత భాగస్వామి దానిని యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. కాబట్టి ఈ పొరపాటు చేయకండి అలానే మీరు ఇష్టపడే వ్యక్తి గురించి అభద్రతాభావం కలగడం సహజమే. మీ జీవిత భాగస్వామి యొక్క స్నేహితుల జాబితాలో అమ్మాయిలు ఉంటే వాళ్ల గురించి అడగండి. అందులో సందేహపడకండి. ఇటువంటి విషయాలని చెప్పకుండా మీరు గోప్యంగా ఉంచడం మంచిది కాదు. అమ్మాయిల గురించి అడగాల్సి వస్తే అడిగేయండి.
Advertisement
ఇటువంటివి దాచిపెట్టినట్లయితే మీ రిలేషన్ పాడవుతుంది అలానే మీరు జీవిత భాగస్వామితో వాళ్ళు గడిపే వ్యక్తుల గురించి కూడా అడగండి. నేరుగా వాళ్ళని కనుక్కోండి. సరైన పదాలను ఉపయోగించి అడగండి. దూకుడుగా ఉండొద్దు. చాలామంది మహిళలకి వంట చేయడం రాదు. అమ్మాయిలూ మీకు కూడా వంట చేయడం రాకపోతే ఓపెన్ గా చెప్పేయండి. దాచి పెట్టొద్దు. నాకు ఇంత వచ్చు అంత వచ్చు అని అబద్ధం చెప్తే భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కోవాలి. పెళ్లి తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీ లక్ష్యాలు ఏమిటి, మీ పిల్లల గురించి ఇలా ఓపెన్ గా ముందే మాట్లాడుకోవాలి. ఇటువంటి విషయాలని దాచి పెట్టకండి. మీ లక్ష్యాలను కానీ మీరు జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారు అనే వాటి గురించి కానీ చెప్పకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడాలి.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!