ఇండియా ఇంగ్లాండ్ మధ్య జనవరి 25 నుండి స్వదేశం లో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం అవ్వాల్సి ఉంది. అయితే జట్టు లో ఎవరెవరికి చోటు దక్కుతుంది అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇటీవల దక్షిణాఫ్రికా తో జరిగిన టెస్ట్ సిరీస్ లో యంగ్ ప్లేయర్లు అయిన శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్ ఆశించినట్లుగా రాణించలేక పోయారు. తొలి టెస్ట్ లో ఘోర పరాభవం ఎదురయింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వెటరన్ బ్యాట్స్మెన్ అజింక్య రహనే, చేతేశ్వర్ పూజారా జట్టు లో ఉంటే బాగుంటుందని అంతా భావించారు.
Advertisement
ఈ టైం లో పుజారా, రహానే నెట్లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తో వాళ్లు కూడా రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని సెలెక్ట్రలకి తెలియజేయడానికి ప్రయత్నించారు. ఇదంతా పక్కన పెడితే రంజీ ట్రోఫీ లో డబల్ సెంచరీ తో పుజారా అదరగొట్టేసాడు. దీంతో సెలెక్టర్లు అతని గురించి ఆలోచించేలా చేశాడు. 2018-2019లో ఆస్ట్రేలియా పై భారత్ తొలిసారి సిరీస్ గెలవడం లో కీలక పాత్ర పోషించాడు పుజారా. ఇప్పుడు కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో జట్టు లోకి తీసుకోవాలని డిమాండ్‌లు అయితే వినపడుతున్నాయి.
Advertisement
రాజ్కోట్ వేదికగా ఝార్ఖండ్లో జరిగిన మ్యాచ్ లో 356 బంతుల్లో 243 కొట్టాడు నాట్ అవుట్ గా నిలిచాడు. రంజీ లో రాణిస్తున్న పుజారా సెలెక్టర్ల ఆలోచనలో పడినట్లే తెలుస్తోంది. ఇంగ్లాండ్ తో సిరీస్ గెలవాలంటే పుజారా వంటి సీనియర్ ప్లేయర్లు కావాలి. ఇక సిరీస్ షెడ్యూల్ వివరాలని చూస్తే.. జనవరి 25- జనవరి 29 (హైదరాబాద్) తొలి టెస్టు, ఫిబ్రవరి 2- ఫిబ్రవరి 6 (విశాఖపట్నం) రెండో టెస్టు. ఫిబ్రవరి 15- ఫిబ్రవరి 19 (రాజ్‌కోట్) మూడవ టెస్టు, ఫిబ్రవరి 23- ఫిబ్రవరి 27 (రాంచీ) నాలుగో టెస్టు, మార్చి 7-మార్చి 11 (ధర్మశాల) ఐదో టెస్టు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!