Home » తెలంగాణ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడానికి ఈ గైడ్ లైన్స్ తప్పనిసరి.. లేదంటే రూ.500 ఫైన్?

తెలంగాణ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడానికి ఈ గైడ్ లైన్స్ తప్పనిసరి.. లేదంటే రూ.500 ఫైన్?

by Srilakshmi Bharathi
Ad

తెలంగాణాలో మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణించడానికి సౌకర్యం కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సౌకర్యం పొందాలనుకున్న మహిళలు కొన్ని నిబంధనలను కూడా కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ నిబంధనల గురించి టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. ఉచితంగా బస్సులో ప్రయాణించాలని అనుకున్న మహిళలు కచ్చితంగా ఒరిజినల్ గుర్తింపు కార్డుని తమతో క్యారీ చెయ్యాలి.

Advertisement

ఈ గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటోతో పాటు.. అడ్రస్ కూడా కచ్చితంగా ఉండాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో జారీ చేయబడ్డ ఏ గుర్తింపు కార్డుని అయినా తీసుకెళ్లవచ్చు. వాటిల్లో ఫోటో, అడ్రస్ కచ్చితంగా ఉండాల్సిందే. అయితే.. పాన్ కార్డు గుర్తింపు కార్డ్ అయినా.. దానిలో అడ్రస్ ఉండదు కాబట్టి పాన్ కార్డు చెల్లదు. ఒరిజినల్ గుర్తింపు కార్డులను చూపించాల్సిందేనని పదే పదే చెబుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు అంటూ ఆయన కామెంట్స్ చేసారు. కొందరు ఫోన్స్ లో ఉండే గుర్తింపు కార్డుల ఫోటోలను చూపిస్తున్నారని.. కానీ ఇవి చెల్లవని స్పష్టం చేశారు.

Advertisement

ఉచిత ప్రయాణం కావాలనుకుంటే.. కచ్చితంగా ఒరిజినల్ గుర్తింపు కార్డుని చూపించాల్సిందేనని సజ్జనార్ స్పష్టం చేసారు. మరి కొందరు గుర్తింపు కార్డుల జెరాక్స్లు, కలర్ జిరాక్స్ లు చూపిస్తున్నారని.. ఇవి కూడా చెల్లవని సజ్జనార్ స్పష్టం చేసారు. కానీ ఇలాంటివి చూపించడం వలన సిబ్బందికి టికెట్ ఇవ్వడానికి ఎక్కువ సమయం పడుతోందని.. ఇతర ప్రయాణికులకు కూడా ఇబ్బంది అవుతోందని సజ్జనార్ పేర్కొన్నారు. ఒకవేళ గుర్తింపు కార్డు లేకుంటే.. కచ్చితంగా టికెట్ తీసుకుని ప్రయాణం చేయాల్సిందేనని సజ్జనార్ తేల్చి చెప్పారు. అయితే.. ఈ సౌకర్యం “మహాలక్ష్మి పధకం” కింద తెలంగాణ మహిళలకు మాత్రమే లభిస్తుందని.. ఇతర రాష్ట్రాల మహిళలు టికెట్ కు డబ్బు చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు. ఫ్రీ ట్రావెల్ ఉన్నా జీరో టికెట్ తీసుకోవడానికి కూడా కొందరు అంగీకరించట్లేదని, వాదిస్తున్నారని తెలిసిందని.. ఇది సరికాదన్నారు. ఈ జీరో టికెట్స్ తోనే ఆర్టీసీకి ప్రభుత్వం డబ్బుని రీయింబర్స్ చేస్తుందని తెలిపారు. టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేస్తే.. చెకింగ్ లో అది గుర్తించబడితే సిబ్బందికి ఉద్యోగం పోతుందని అన్నారు. అలాగే అలా ప్రయాణం చేస్తున్న వ్యక్తులకు ఐదు వందల రూపాయలు జరిమానా విధించబడుతుందని తెలిపారు.

 తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading