Home » కాస్ట్లీ కార‌వాన్ కొనుగోలు చేసిన టాలీవుడ్ న‌టుడు..!

కాస్ట్లీ కార‌వాన్ కొనుగోలు చేసిన టాలీవుడ్ న‌టుడు..!

by AJAY
Ad

సాధార‌ణంగా కార‌వాన్ క‌ల్చ‌ర్ అనేది బాలీవుడ్ లో ఎక్కువ‌గా వినిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ క‌ల్చ‌ర్ మ‌న టాలీవుడ్ లో కూడా షురూ అయ్యింది. ఇప్ప‌టికే టాలీవుడ్ కు చెందిన హీరోలు అంద‌రూ కార‌వాన్ లు కొనుగోలు చేశారు. వాటిలో అల్లు అర్జ‌న్ కార‌వాన్ కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఈ కార‌వాన్ అల్లు అర్జున్ లాగానే ఎంతో స్టైలిష్ గా ఉండ‌టం తో పాటూ ఎన్నో సౌక‌ర్యాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే తాను కొత్త కార‌వాన్ కొనుగోలు చేశాన‌ని సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ వెల్ల‌డించారు. ముంబై నుండి త‌న కార‌వాన్ ను తెప్పించుకున్నాన‌ని అన్నాడు.

Advertisement

naresh caravan

Advertisement

న‌టుల జీవితం దాదాపు 70 శాతం వ‌ర‌కూ కార‌వాన్ లోనే గడుస్తుంద‌ని న‌రేష్ అన్నారు. ఒక‌రు వాడిన కార‌వాన్ ను వాడ‌టం త‌న‌కు ఇష్టం లేద‌ని అందుకే ముంబై నుండి కొత్త కార‌వాన్ ను తెప్పించుకున్నాన‌ని న‌రేష్ తెలిపారు. త‌న జీవిత అవ‌స‌రాల‌కు అనుగుణంగా కార‌వాన్ ను కొనుగోలు చేశాన‌ని ఈ కార‌వాన్ లో ఏసీ ఉందని అదే విధంగా జిమ్, మేక‌ప్ రూమ్, వాష్ రూం, వెయిటింగ్ రూమ్ లు ఉన్నాయ‌ని చెప్పారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేవ‌లం హీరోల‌కు మాత్ర‌మే కార‌వాన్ లు ఉన్నాయి కానీ కార‌వాన్ ఉన్న ఏకైక క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ న‌రేష్ మాత్ర‌మే.

Visitors Are Also Reading