Home » మోడీ కి మద్దతు గా సచిన్ టెండూల్కర్… భారతదేశంలో కూడా అద్భుతమైన ప్రదేశాలున్నాయంటూ..!

మోడీ కి మద్దతు గా సచిన్ టెండూల్కర్… భారతదేశంలో కూడా అద్భుతమైన ప్రదేశాలున్నాయంటూ..!

by Sravya
Ad

మాల్దీవుల విషయంలో క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పరోక్షంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అతిథిదేవోభవ సంస్కృతి కలిగిన మన ఇండియాలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయని సచిన్ చెప్పారు. మాల్దీవులు ప్రజలు ఇండియా అవుట్ అని పేర్కొనడంతో సచిన్ ట్వీట్ చేయడం జరిగింది. ఇక అసలేం జరిగిందనేది చూస్తే… ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ లో పర్యటించిన విషయం మనకి తెలిసిందే. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సముద్రంలో స్నార్కెలింగ్ చేశారు. సముద్రం తీరాన కాసేపు విశ్రాంతి తీసుకున్నారు మోడీ. దీనికి సంబంధించిన ఫోటోలు ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది.

Advertisement

లక్షద్వీప్ సౌందర్యం అక్కడి ప్రజలు మమకారం చూసి ఆనందంలో మునిగిపోయాను అక్కడ ప్రకృతి అందాలు ప్రశాంతమైన వాతావరణం మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. పర్యటకులు లక్షద్వీప్ ని కూడా వీక్షించండి అని ట్విట్టర్ వేదికగా మోడీ షేర్ చేయడం జరిగింది. దీంతో తమ పర్యాటక రంగం ప్రభావం చూపిస్తుందని భావించిన మాల్దీవులు ఎంపీ జహీర్ ఘోరంగా కామెంట్స్ చేసారు. పర్యాటకంలో తమ దేశంతో భారత్ పోటీ పడలేదని చెప్పారు. మాల్దీవులు అందించే సర్వీస్ పరిశుభ్రత అందించలేరని చెప్పారు.

Advertisement

ఇండియా గదుల్లో దుర్వాసన వస్తుందని చెప్పుకొచ్చారు దీంతో మాల్దీవులని బహిష్కరించాలని దేశంలోని ఐలాండ్స్ లో పర్యాట పర్యటించాలని నెటిజెన్స్ పోస్టులు పెట్టడం జరుగుతోంది. సచిన్ టెండుల్కర్ కూడా ట్వీట్ చేశారు. సింధు దుర్గ్ లో నా 50వ పుట్టినరోజుని జరుపుకుని దాదాపు 250కి పైగా రోజులు గడిచాయి. ఈ తీర ప్రాంతంలో మనకి కావాల్సిన సదుపాయాలని ఇస్తాయి. అద్భుతమైన అతిథ్యంలో అందమైన ప్రదేశాలతో నాకు జ్ఞాపకాలు నిధిని అందించాయి. భారతదేశంలో గొప్ప తీరప్రాంతాలు సహజసిద్ధమైన దీవులు ఉన్నాయి. మనదేశంలో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయంటూ సచిన్ టెండూల్కర్ ట్విట్ చేశారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading