Home » భోగి పండుగ నాడు ఏం చెయ్యాలి..? ఏం చెయ్యకూడదు..? ఈ తప్పులు మాత్రం అస్సలు చెయ్యకండి..!

భోగి పండుగ నాడు ఏం చెయ్యాలి..? ఏం చెయ్యకూడదు..? ఈ తప్పులు మాత్రం అస్సలు చెయ్యకండి..!

by Sravya
Ad

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి పండుగ కూడా ఒకటి. సంక్రాంతి పండుగను పెద్ద పండుగ అని కూడా అంటారు. పెద్ద పండుగని మొత్తం మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. మొదటిరోజు భోగి పండుగ. భోగి పండుగని ప్రతి ఏటా కూడా మనం జరుపుకుంటూ ఉంటాము. కచ్చితంగా కొన్ని ఆచారాలను పాటించాలి గ్రామాల్లో చాలామంది సాంప్రదాయ ఆచారాల ప్రకారం భోగి పండుగను చేసుకుంటుంటారు. నగరాల్లో ఉండేవాళ్ళు పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వరు కానీ ఖచ్చితంగా పల్లెల్లో ఉన్న వాళ్ళు భోగి పండుగని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే అసలు భోగి పండుగ నాడు ఏం చేయాలి..?, ఏం చేయకూడదు..? భోగి పండుగనాడు చేయాల్సినవి చేయకూడనివి ఇప్పుడే చూసేద్దాం.

Advertisement

Advertisement

మన పూర్వీకులు భోగి రోజున ఇంటి దేవతలను పూజించే వాళ్ళట. అందుకే ప్రతి సంవత్సరం భోగి పండుగ రోజున కులదేవత ఆలయానికి వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు. దీనివలన అంతా మంచే జరుగుతుంది. వైద్య విధానంగా ఈ పండుగని ఉపయోగించేవారు. ఈ సమయంలోనే పంటలు చేతికి వస్తాయి ధాన్యాన్ని ఇంటికి తీసుకువచ్చే సమయం ఇదే. కనుక తెగుళ్లు క్రిములు బారిన పడకుండా ఉండేందుకు పసుపు నీటిని చల్లడం, పేడతో అలకడం, ధూపం వేయడం వంటి పనులు చేసేవారు.

ఇలా చేస్తే ఇంట్లోకి క్రిములు రావు. భోగి పండుగనాడు అసలు మాంసాన్ని తినకూడదు. పురుషులు మాదకద్రవ్యాలని మత్తు పదార్థాలని తీసుకోకూడదు. భోగి పండుగ నాడు ఉదయం పూట నిద్రపోతే ఇంటి దైవానికి కోపం వస్తుంది. అలానే భోగి నాడు పరిశుభ్రతను పాటించాలి భోగిమంటల్లో కేవలం కట్టెలని మాత్రమే వేయాలి. దీంతో గాలి కాలుష్యం అయ్యే అవకాశం ఉండదు టైర్లు ప్లాస్టిక్ వంటి వాటిని అసలు వేయకూడదు. ఇలా భోగి నాడు వీటిని ఆచరిస్తే మంచిది. భోగి పండుగ నాడు చిన్న పిల్లలకి భోగి పండ్లు పోయడం వంటివి కూడా చేస్తూ ఉంటారు.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading