Home » భూమికి సూర్యునికి మ‌ధ్య దూరాన్ని క‌రెక్ట్ గా చెప్పిన హ‌నుమాన్ చాలీసాలోని 18 వ శ్లోకం!

భూమికి సూర్యునికి మ‌ధ్య దూరాన్ని క‌రెక్ట్ గా చెప్పిన హ‌నుమాన్ చాలీసాలోని 18 వ శ్లోకం!

by Azhar
Ad

16వ గోస్వామి తుల‌సీదాస్ అవ‌ధి భాష‌లో హ‌నుమాన్ చాలీసాను రాశాడు. చాలీసా అనే ప‌దం చాలీస్ అనే ప‌దం నుండి వ‌చ్చింది. చాలీస్ అంటే 40 …ఈ హ‌నుమాన్ చాలీసాలో ….హ‌నుమాన్ ను కీర్తిస్తూ 40 శ్లోకాలుంటాయి. అందులోని 16వ శ్లోకంలో భూమికి సూర్యునికి మ‌ధ్య దూరం గురించి చెప్ప‌బ‌డింది.

Advertisement

ఒక‌సారి ఆ శ్లోకాన్ని చూద్దాం!

యుగ స‌హ‌స్ర యోజ‌న పర భాను |
లీల్యో తాహి మ‌ధుర ఫ‌ల జానూ ||

దీని అర్థం : 12 వేల దైవ‌ మైళ్ల దూరంలో ఉన్న సూర్యున్ని మ‌ధుర‌ ఫ‌లమ‌ని భావించి నువ్వు దానిని మింగాల‌నుకున్నావు.

వివ‌ర‌ణ :

Advertisement

  • యుగం = స‌త్య‌, త్రేతా, ద్వాప‌ర, క‌లి యుగాలు. వీట‌న్నింటిని క‌లిపి మ‌హాయుగం అంటారు.
    స‌త్య‌యుగం = 4800 దైవ సంవ‌త్స‌రాలు
    త్రేతాయుగం = 3600 దైవ సంవ‌త్స‌రాలు
    ద్వాప‌ర‌యుగం = 2400 దైవ సంవ‌త్స‌రాలు
    క‌లియుగం = 1200 దైవ సంవ‌త్స‌రాలు
  • స‌త్య‌, త్రేతా, ద్వాప‌ర, క‌లి యుగాల మొత్తం = 12000
  • స‌హ‌స్ర అంటే 1000 అని అర్థం.
  • 1 యోజ‌న అంటే సుమారుగా 8 మైళ్లు.
  • యుగ స‌హ‌స్ర యోజ‌న :  12,000 x 1000 x 8 = 96,000,000 మైళ్లు.

సైన్స్ :

సైంటిస్టుల లెక్క‌ల ప్ర‌కారం సూర్యుడికి, భూమికి మ‌ధ్య ఉన్న దూరం దాదాపుగా 92,960,000 మైళ్లు అని తేలింది. ఇది ఇంచుమించు హ‌నుమాన్ చాలిసాలో చెప్పిన సంఖ్య‌తో దాదాపు స‌మానం.

Visitors Are Also Reading