మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం సినిమా తెర మీదకి రాబోతుంది ఈ సినిమా మీద మహేష్ బాబు ఫ్యాన్స్ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా విడుదల చేసిన ”కుర్చీ మడత పెట్టి” పాటతో అటు త్రివిక్రమ్ మీద ఇటు మహేష్ బాబు పైన తీవ్ర విమర్శలు వచ్చాయి. తమన్ కాఫీ కాట్ అని అంటూ ఉంటారు. మరొకసారి ప్రూవ్ అయిపోయింది. అయితే మహేష్ బాబు ఇలాంటి పాటని చెప్పడం కొంతమంది ఫ్యాన్స్ కి నచ్చట్లేదు.
Advertisement
అలానే నీతులు మాట్లాడే త్రివిక్రమ్ ఇలాంటి పాట పెట్టడం ఏంటని విమర్శలు వచ్చాయి. తాజాగా సినిమా కథ గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. గుంటూరు కారం సినిమాలో ఈ సినిమాలో పొలిటికల్ హీట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా వచ్చిన సాంగ్ లిరిక్స్ కూడా చాలా దాకా పొలిటికల్ సెటైర్లు గా కనపడ్డాయి. ఇక ఈ సినిమా కథ కూడా రాజకీయ నేపథ్యంలోనే తెర మీదకి తీసుకురావడం జరిగింది. టీజర్ లో ఎక్కడా కూడా కథని రివిల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు త్రివిక్రమ్.
Advertisement
ట్రైలర్ లో కూడా కాదని రివిల్ చేయకుండా మహేష్ బాబు మాస్ ఎలిమెంట్స్ చూపించారు. మహేష్ బాబు ఈ సినిమాలో వెంకటరమణారెడ్డి గా కనిపించబోతున్నారు రాజకీయాలంటే ఇష్టం లేని వెంకటరమణారెడ్డి గుంటూరు రాజకీయాన్ని ఎలా శాసించారు అనేది కథ. తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయ శత్రువుల్ని ఎలా ఎదుర్కొంటున్నారు మహేష్ బాబు అనేది కథ అని లీక్ అయిపోయింది. ఈ మధ్య రిలీజ్ అయిన దమ్మసాల పాటలో మహేష్ బాబు కారు అద్దంపై జనదళం కాగడా గుర్తు కనిపించడంతో అంతా పొలిటికల్ సినిమా అని ఫిక్స్ అయిపోయారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!