12th ఫెయిల్ సినిమా రిలీజ్ అయినా విషయం తెలిసిందే. ఈ సినిమాకి విద్దు వినోద్ చోప్రా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విక్రాంత్ మాసే, మేధాశంకర్ నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా బాగానే వసూళ్లను రాబట్టింది. అలానే ఓటిటి ప్లాట్ఫారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమా రియల్ స్టోరీ ఈ విషయం చాలా మందికి తెలియదు.
Advertisement
ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ అలానే అతని భార్య ఐఆర్ఎస్ ఆఫీసర్ శ్రద్ధ గోష్ ల నిజమైన కథ ఇది వాళ్ళ రియల్ లైఫ్ స్టోరీ ని తెర మీదకి తీసుకువచ్చారు. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ అలానే అతని భార్య శ్రద్ధ గోష్ ల సక్సెస్ స్టోరీ చాలా ఆదర్శంగా ఉంది.
Advertisement
వీళ్ళ లైఫ్ ని సక్సెస్ ని కథ గా తీసుకుని తెరమీదకి తీసుకురావడం జరిగింది. మనోజ్ కుమార్ శర్మ పేదరికం ఎదుర్కొని మంచి పోజిషన్ లోకి వచ్చారు. మనోజ్ గా విక్రాంత్ తెరమీద అద్భుతంగా నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. యూపీఎస్సీ ఎంత కష్టమో మనకి తెలుసు. ఎంతోమంది విద్యార్థులు యూపీఎస్సీలో సక్సెస్ ని అందుకోవాలని కష్టపడుతుంటారు. ప్రతి ఏటా కొన్ని లక్షల మంది విద్యార్థులు యూపీఎస్సీ పరీక్ష ని రాస్తూ ఉంటారు ఒక మంచి ఐఏఎస్ అవ్వాలని, ఐపీఎస్ అవ్వాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు. మనోజ్ ఒక పేద కుటుంబంలో పుట్టారు.
మనోజ్ 9 ,10 తరగతిలో మూడవ డివిజన్ లో పాసయ్యారు. 12వ తరగతిలో చూసుకున్నట్లయితే హిందీ తప్ప అన్ని సబ్జెక్టులలో కూడా ఫెయిల్ అయ్యారు. మనోజ్ కుమార్ శర్మ కి అప్పుడు అకాడమిక్స్ మీద ఆసక్తి ఉండేది కాదట. రెండవ సారి రాసి మొత్తం అన్ని సబ్జెక్టులలో పాస్ అయ్యారు. ఎన్నో రాత్రులు రోడ్డు మీద పడుకున్నారు చాలా రోజులు పస్తులు కూడా ఉండేవారట. ఒక డ్రైవర్ గా కూడా పని చేసి ఎంతో కష్టపడి ఫైనల్ గా యూపీఎస్సీ పరీక్ష పాసయ్యారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!