విజయ్ కాంత్ చనిపోయిన విషయం తెలిసిందే. విజయ్ కాంత్ అనారోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో ఎడ్మిట్ అయ్యారు అని అంతా భావించారు. కానీ కరోనా సోకడం వలన విజయ్ కాంత్ చనిపోయారు. విజయ్ కాంత్ మరణం తెలుగు ప్రేక్షకులకు, తమిళ ప్రేక్షకులకి కూడా తీరని లోటు. కెప్టెన్ విజయ్ కాంత్ మృతదేహానికి నివాళులు అర్పించడానికి తమిళనాడు విజయ్ వెళ్లడం జరిగింది. డిసెంబర్ 28 రాత్రి విజయ్ విజయ్ కాంత్ మృతదేహానికి నివాళులర్పించడానికి వెళ్లారు. వీళ్లిద్దరి మధ్య బంధం చాలా బాగుండేది. విజయ్ సినిమాల్లోకి రావడానికి విజయ్ కాంత్ సహాయం కూడా చేశారు.
విజయ్ కాంత్ ముందే చిన్నప్పటినుండి కూడా పెరిగారు విజయ్. ఆయన్ని గాడ్ ఫాదర్ గా భావిస్తారు విజయ్. వీళ్ళ మధ్య బంధం బాగుండేది. అందుకే వీళ్ళ ఫ్యామిలీలు కూడా అప్పుడప్పుడు బయట కలుస్తూ ఉండేవారట. విజయ్ తండ్రి ఎస్సే చంద్రశేఖర్ కారణంగా బంధం అంత స్ట్రాంగ్ గా మారింది. హీరోగా విజయ్ కాంత్ కి గుర్తింపు లేని సమయంలో చంద్రశేఖర్ విజయకాంత్ కి అవకాశం ఇచ్చారు. అలా హీరోగా అవకాశాన్ని పొందారు విజయ్ కాంత్. చాలామంది విజయ్ కాంత్ ని హీరోగా పనికి రావని చెప్పేవారట కానీ చంద్రశేఖర్ మాత్రం విజయ్ కాంత్ కి హీరోగా అవకాశాన్ని ఇచ్చారు.
Advertisement
Advertisement
ఇది ఇలా ఉంటే విజయ్ కాంత్ మృతదేహాన్ని చూసి విజయ్ కంటతడి పెట్టుకున్నారు తర్వాత ఆయన కుటుంబ సభ్యుని పరామర్శించారు. విజయ్ రావడంతో ఆయనని చూడడానికి అభిమానులు ఉత్సాహంతో చుట్టుముట్టేశారు. సెక్యూరిటీ ఆపిన కూడా అభిమానులు ఆగలేదు. విజయ్ ని తాకేందుకు ఎగబడ్డారు. అప్పుడు ఒక గుర్తు తెలియని వ్యక్తి విజయ్ పైకి చెప్పు విసిరాడు. అది విజయ్ కి తగలలేదు. కొద్దిలో మిస్సయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. అజిత్ ఫాన్స్ ఇలా చేసి ఉంటారేమో అని అంతా అన్నారు కానీ అజిత్ ఫ్యాన్స్ ఇలా చేయలేదని చెప్పారు. విజయ్ సినిమా కెరియర్ కోసం విజయ్ కాంత్ తన సొంత డబ్బును కూడా ఖర్చు పెట్టారట. అయితే రాజకీయాల్లో వెనకబడిన విజయకాంత్ కి మాత్రం ఒకనాడు కూడా విజయ్ సపోర్ట్ ఇవ్వలేదు బహుశా ఈ కారణం వలన ఇలా జరిగి ఉండొచ్చు అని అంతా అభిప్రాయపడుతున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!