అధిక బరువు అనేది ప్రస్తుతం అందరిని వేధిస్తున్న సమస్య. ప్రతి ఒక్కరు బరువు తగ్గించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే.. చాలా మంది అందుకోసం తిండి మానేస్తుంటారు. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ తినడం మానేస్తూ ఉంటారు. కానీ, ఇది చాలా తప్పు. బరువు తగ్గాలని అనుకునే వారు ప్రొపెర్ డైట్ తీసుకుంటూనే ప్రయత్నాలు చేయాలి. బ్రేక్ ఫాస్ట్ ని కచ్చితంగా తీసుకోవాలి. అయితే.. ఎక్కువ వెయిట్ గైన్ చేసే ఫుడ్స్ కాకుండా.. స్వల్ప ఆహారాలను తీసుకోవడం ద్వారా బరువుని అదుపులో ఉంచుకోవచ్చు.
Advertisement
బరువు తగ్గడం కోసం ఎలాంటి ఆహార పదార్ధాలను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గించే ఆహారంలో ఓట్స్ ముందు వరసలో ఉంటాయి. ఓట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కొవ్వు తక్కువగా ఉండి, బీటా గ్లూకాన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. బరువుని కూడా తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. ఓట్స్ కాకుండా.. నట్స్ కూడా బరువు తగ్గించడంలో కీ రోల్ పోషిస్తుంది.
Advertisement
నట్స్ లో కూడా కొవ్వు తక్కువగా ఉండడంతో పాటు.. హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారు. అలాగే ఉదయాన్నే తినడానికి గుడ్లు కూడా మంచి పోషకాహారం. గుడ్లను ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం వలన కడుపు నిండుగా ఉండడంతో పాటు అన్ని రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. గుడ్లలో ఉండే సెలీనియం, రిబోఫ్లేవిన్ పదార్ధాలు శరీరానికి మేలు చేకూరుస్తాయి. వీటిని వండడం కూడా తేలిక. ఉడకబెట్టి తినొచ్చు లేదా ఆమ్లెట్ లా వేసుకుని తినొచ్చు. అరటిపండు తింటే బరువు పెరుగుతారు అని చాల మంది అపోహ పడతారు. కానీ, ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండు తింటే.. మీ కడుపు నిండిన ఫీలింగ్ కలగడమే కాకుండా.. మీ బరువు కూడా తగ్గుతుంది. అరటిపండులో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా దొరుకుతుంది. అరటిపండులో ఉండే స్టార్చ్ నెమ్మదిగా జీర్ణం అవుతుంది. ఆకలి కాకుండా చేస్తుంది. శరీరానికి త్వరగా శక్తిని అందిస్తుంది.