Home » పూజ చేసేటప్పుడు ఈ పాత్రలను వాడకూడదు.. ఎన్నో ఇబ్బందులు వస్తాయి..!

పూజ చేసేటప్పుడు ఈ పాత్రలను వాడకూడదు.. ఎన్నో ఇబ్బందులు వస్తాయి..!

by Sravya
Ad

ప్రతి ఒక్కరు కూడా రోజు పూజ చెయ్యాలి. నిజానికి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా రోజు దీపం వెలగాలి. దీపారాధన చేస్తే చాలా మంచి జరుగుతుంది. దీపారాధన చేయకపోతే ఇంట్లోకి అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయితే పూజ చేసేటప్పుడు కచ్చితంగా కొన్ని విషయాలని గుర్తు పెట్టుకోవాలి. పూజ చేసేటప్పుడు ఈ విషయాలని పాటించకపోతే అనవసరంగా ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది. జ్యోతిష్య నిపుణులు మనతో కొన్ని విషయాలని చెప్పారు. వీటిని కనుక మీరు అనుసరించారంటే అంతా మంచే జరుగుతుంది. ఎప్పుడూ కూడా పూజ చేసేటప్పుడు ఇనుప పాత్రలని వాడకూడదు.

Advertisement

జ్యోతిష్య పండితులు ఈ విషయాన్ని చెప్తున్నారు. ఇనుము స్వచ్ఛమైన లోహంగా వర్గీకరించదు. పూజలులో అసలు ఇనుప పాత్రలను ఉపయోగించకూడదు. ఒకవేళ ఉపయోగిస్తే మీరు ఇబ్బంది పడాలి, శనిదేవుని పూజించేటప్పుడు మీరు ఇనుప పాత్రను ఉపయోగించవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్మలు లేదా పూజలు చేసినప్పుడు స్టీల్, అల్యూమినియం లోహాలు ఉపయోగించకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవి అపవిత్రంగా పరిగణించబడతాయి. అలానే దేవుడి విగ్రహాలు కూడా ఎప్పుడూ ఈ లోహాలతో తయారు చేసినవి అయ్యి ఉండకూడదు.

Advertisement

కాబట్టి ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనించడం మంచిది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండితో చేసిన వాటిని కూడా పూజలో వాడకూడదు. వెండి చంద్రునితో సంబంధం కలిగి ఉంటుంది. ఆనందాన్ని శాంతిని చల్లదనాన్ని ప్రసాదిస్తాడు అయితే వెండి లోహంతో చేసిన వాటిని మాత్రం అసలు పూజకి ఉపయోగించకూడదట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూజ చేయడానికి రాగి ఉత్తమమైనది. రాగి పాత్రలను ఉపయోగించడం వలన ఎంతో మంచి జరుగుతుంది. రాగి పాత్రను ఉపయోగిస్తే దేవతలని ఎంతో సంతోషంగా వుంచవచ్చట. కాబట్టి ఈ విషయాలని గుర్తు పెట్టుకొని ఇక్కడ విషయాల్ని ఆచరించినట్లయితే మంచి జరుగుతుంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading