ప్రతి ఇంట్లో గ్యాస్ అనేది ఓ నిత్యావసరం. ఈ మధ్య ఎలక్ట్రిక్ కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్ లు ఎన్ని రకాలు వచ్చినా.. గ్యాస్ పొయ్యి మీద వంట చేసినంత తేలికగా మిగతా వాటిమీద చేయలేము. ఎప్పుడైనా అవసరం కొద్దీ అడ్జస్ట్ అయ్యినా.. గ్యాస్ పొయ్యి మాత్రం ప్రతి రోజు ఉండాల్సిన వస్తువే. గ్యాస్ సిలిండర్ ఇంట్లో ఉంటేనే మన వంట పని తేలిక అవుతుంది. అయితే.. గ్యాస్ సీలిండర్ ఎప్పుడు అయిపోతుందో మనం చెప్పడం కష్టం. ఒక్కోసారి వంట చేస్తుండగా.. మధ్యలోనే గ్యాస్ అయిపోయి ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది.
Advertisement
అటువంటి సమయంలో పక్కన వారిని అడిగి తీసుకొస్తూ ఉంటాం. లేదా మరో ప్రత్యామ్నాయం చూస్తాం. కొంతమంది ఇటువంటి సిట్యుయేషన్ వస్తుందనే ఉద్దేశ్యంతోనే రెండు సిలిండర్లు పెట్టుకుంటూ ఉంటారు. అయితే.. మధ్య తరగతి కుటుంబాల్లో అందరూ అలా చెయ్యలేరు. అందుకే.. గ్యాస్ సీలిండర్ లో ఎంతవరకు గ్యాస్ ఉంది అన్న విషయాన్నీ తెలుసుకుంటే ముందు జాగ్రత్తగా మరో గ్యాస్ ని బుక్ చేసుకోవచ్చు.
Advertisement
అయితే.. చిన్న ట్రిక్ తో దీన్ని తెలుసుకోవచ్చు. ముందుగా ఓ తడిగుడ్డ తీసుకుని గ్యాస్ బండపై పైనుంచి కింద వరకూ తుడవాలి. అయితే.. పై భాగంలో త్వరగా ఆరిపోతూ ఉంటుంది. అంటే.. గ్యాస్ లేని లెవెల్ వరకు తడి త్వరగా ఆరిపోతుంది. కింద ఏ లెవెల్ వరకు ఇంకా తడిగా కనిపిస్తోందో చూసుకోవాలి. అంటే ఆ లెవెల్ వరకు గ్యాస్ ఉందని అర్ధం. అలాగే.. మరో చిట్కా కూడా ఉంది. ఓ గ్లాస్ లో గోరు వెచ్చని నీటిని తీసుకుని బండ మధ్య భాగంలో పోయాలి. ఏ లెవెల్ వరకు తడి ఆరకుండా ఉంటోందో చూసుకోవాలి. అంటే ఆ లెవెల్ వరకు గ్యాస్ ఉందని అర్ధం చేసుకోవాలి. ఈ చిన్న ట్రిక్ ని ప్రయత్నించి చూడండి. మీ పని సులువు అయిపోతుంది.