నటుడు విజయ్ కాంత్ క్షేమంగా తిరిగి వస్తారని ఆసుపత్రిలో వైద్యం తీసుకున్న తర్వాత యధావిధిగా అనారోగ్యం నుండి కోల్కొని తిరిగి వస్తారని అంతా భావించారు. కానీ విజయ్ కాంత్ ఆరోగ్యం పాడయ్యింది. కరోనా బారిన కూడా పడ్డారు. దాంతో హఠాత్తుగా ఆయన చనిపోయారు. అయన మరణం అటు తమిళ ప్రజలకి ఇటు తెలుగు ప్రజలకి కూడా తీరని లోటు. విజయ్
కాంత్ అటు రాజకీయాలు ఇటు సినిమాల్లో కూడా బిజీగా ఉండేవారు. విజయ్ కాంత్ పొలిటికల్ లైఫ్ గురించి సినిమాల గురించి మనకు తెలుసు. కానీ పర్సనల్ లైఫ్ గురించి చాలా విషయాలు మనకి తెలియదు. విజయ్ కాంత్ గారి భార్య పిల్లలు అందమైన ప్రేమ కథ గురించి ఈరోజు తెలుసుకుందాం.
Advertisement
Advertisement
విజయ్ కాంత్ ప్రేమలత ఇద్దరు ప్రేమించుకున్నారు. విజయ్ కాంత్ కంటే ప్రేమలత 17 ఏళ్లు చిన్నది. వీళ్ళ పెళ్లి టైం కి ఆమె వయసు 21 సంవత్సరాలు మాత్రమే. విజయ్ కాంత్ పెళ్లి చూపులప్పుడు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు. ఒక హీరోని అని కానీ ఇంత స్టేజ్ లో ఉన్నానని కానీ ఏ మాత్రం గర్వం లేకుండా ఆమె దగ్గరికి వెళ్లారట. ఆమె ఆయన వినయం చూసి ఇష్టపడ్డారట. ప్రేమలత తండ్రి కూడా అల్లుడు విజయ్ కాంత్ అని ఫిక్స్ అయిపోయారట. ఆయన ప్రవర్తన నచ్చి అయన కూడా ఫిక్స్ అయ్యారు.
పెళ్లి నాటికి వీళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మంచి ప్రేమికులుగా మారారు. వీళ్లిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కొడుకు విజయ్ ప్రభాకర్. రెండవ కొడుకు పేరు షణ్ముఖ పాండియన్. వీళ్ళిద్దరూ కూడా అందరికీ సుపరిచితమే పెద్ద కొడుకు రాజకీయాల్లో చిన్న కొడుకు సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. పెద్ద కొడుకు నిశ్చితార్థం అయ్యింది కానీ కొన్ని కారణాల వలన అతని వాయిదా పడుతూ వచ్చింది పెళ్లి త్వరలో చేసుకోబోతున్నారని తెలుస్తోంది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!