కోలీవుడ్ అభిమానులందరూ విజయ్ కాంత్ ను ముద్దుగా కెప్టెన్ అని పిలుహక్కుకుంటూ ఉంటారు. దానికి కారణం ఆయన నటించిన “కెప్టెన్ ప్రభాకరన్” సినిమా. ఈ సినిమా ఆయన కెరీర్ లో వందవ సినిమాగా రూపొందింది. తనదైన స్టైల్ లో సెంచరీని నమోదు చేసిన విజయ్ కాంత్ ను ఆయన అభిమానులు ముద్దుగా కెప్టెన్ అని సంబోధిస్తూ ఉంటారు. ఆర్కే సెల్వమణి దర్శకత్వం వహించిన కెప్టెన్ ప్రభాకరన్ లో విజయ్ కాంత్ ను IFS అధికారిగా చూపించారు. ఇందులో మన్సూర్ అలీ ఖాన్ వీరభద్రన్ పాత్రలో కీలక పాత్ర పోషించారు, ఇది అటవీ దళారి వీరప్పన్ ఆధారంగా రూపొందించబడింది.
Advertisement
ఈ సినిమాలో విజయ్ కాంత్ నటించిన యాక్షన్ సన్నివేశాలకు అందరూ ముగ్ధులు అయ్యారు. ఈ సినిమాలో అతని ధైర్యాన్ని చూసి అందరు ఆశ్చర్యపోయారు. కఠినమైన సన్నివేశాలను విజయ్ కాంత్ ధైర్యంగా నటించారు. అంతకుముందు చాలానే హిట్ సినిమాలు చేసినప్పటికీ ఈ సినిమా మాత్రం స్పెషల్‌గా నిలిచిపోయింది. ఈ సినిమా తరువాత నుంచి ఆయన్ను ముద్దుగా కెప్టెన్ అని పిలుచుకోవడం స్టార్ట్ చేసారు.
Advertisement
నడిగర్ సంఘం చీఫ్‌గా పనిచేసినప్పుడు కేవలం సినిమా కారణంగానే కాకుండా పరిశ్రమ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనడం వల్ల చాలా సినీ, రాజకీయ సమావేశాల్లో ఆయన్ను ‘కెప్టెన్’ అని పిలిచేవారు. అనేక మంది దర్శకులను పరిశ్రమకు పరిచయం చేయడంలో మరియు వడివేలు మరియు విజయ్‌లతో సహా నేటి ప్రముఖ నటులు వారి ప్రారంభ సంవత్సరాల్లో మద్దతు ఇవ్వడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. విజయకాంత్ ‘కెప్టెన్ టీవీ’ అనే తమిళ టీవీ ఛానెల్‌ని కూడా స్థాపించారు. రజిని ని సూపర్ స్టార్ అని, కమల్ ని ‘ఉలగ నాయగన్’ అని పిలుచుకునే అభిమానులు విజయ్ కాంత్ ని కెప్టెన్ అనే పిలుచుకుంటారు.