Home » సలార్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ ఎంత పారితోషకాన్ని తీసుకున్నారో తెలుసా..?

సలార్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ ఎంత పారితోషకాన్ని తీసుకున్నారో తెలుసా..?

by Sravya
Ad

బాహుబలి సినిమా తర్వాత పెద్ద హిట్ కోసం ఎంతగానో ప్రభాస్ కష్టపడ్డారు. కానీ ప్రభాస్ కి ఆశించిన స్థాయిలో హిట్ లభించలేదు. ఇప్పుడు వచ్చిన సలార్ సినిమాతో ప్రభాస్ కి హిట్ వచ్చింది. ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా కి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు ప్రస్తుతం సోషల్ మీడియా తో పాటుగా ప్రధాన మీడియా కూడా సలార్ గురించి చర్చలు నడిపిస్తోంది. ఆరు సంవత్సరాల తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ కి సరైన హిట్ వచ్చింది ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుండి కూడా కలెక్షన్లు బానే వస్తున్నాయి మొదటి రోజు ఏకంగా 180 కోట్లను వసూలు చేసింది. రెండవ రోజు 150 కోట్లని వసూలు చేసింది ఈ సినిమా లో చిన్న చిన్న పాత్రలు నటించిన వాళ్లందరికీ కూడా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు వచ్చింది.

Advertisement

Advertisement

ఈ సినిమా కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎంత పారితోషకం తీసుకున్నారు అనేది ప్రస్తుతం వైరల్ అవుతోంది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసిన సినిమా కి 100 కోట్ల కి తక్కువ కాకుండా రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నాడు. ప్రభాస్ పైగా తాను చేసే సినిమాల్లో అదనంగా లాభాల్లో 10% వాటాన్ని కూడా తీసుకుంటున్నాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా కి 100 కోట్లు ఇచ్చారు. సినిమా కన్నా రెమ్యూనిరేషన్ల కి నిర్మాత ఎక్కువ బడ్జెట్ ని పెట్టినట్లు తెలుస్తోంది.

ప్రభాస్ కి మంచి హిట్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ కి హిట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ కి ఎంత ఇచ్చినా తప్పులేదు అని అందరూ భావిస్తున్నారు. రెండు పార్టులకి కలిపి, 100 కోట్లు ఇచ్చారా..? లేదంటే ఒకే పార్ట్ కి 100 కోట్లు ఇచ్చారు అనేది తెలియాల్సి ఉంది. సలార్ సినిమా లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. సలార్ 2 కోసం ఆ ప్రశ్నలని అలా వదిలేశారు. సలార్ టు సినిమా లో ట్విస్టులు మొత్తం అన్నీ కూడా ఓపెన్ చేస్తారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading